స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాల పాత్ర కీలకం

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

కడప సెవెన్‌రోడ్స్‌ : స్వాతంత్య్ర ఉద్యమంలో గ్రంథాలయాలు కీలకపాత్ర పోషించాయని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దాసరి భానుప్రకాష్‌ తెలిపారు. శనివారం స్థానిక జిల్లా కేంద్ర గ్రంథాలయంలో 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఇతర అతిథులతో కలిసి తొలుత జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేసి చేశారు. అనంతరం పండిట్‌ జవహర్‌ లాల్‌ నెహ్రు, పద్మశ్రీ అయ్యంకి వెంకట రమణయ్య, ఆంధ్ర తిలక్‌ గాడిచర్ల హరిసర్వోత్తమ రావుల చిత్ర పటాలకు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా చైర్మన్‌ దాసరి భానుప్రకాష్‌ మాట్లాడుతూ జిల్లాలోని 63 గ్రంథాలయాల్లో 20వ తేదీ వరకు వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు పలు రకాల పోటీలు నిర్వహిస్తున్నామన్నారు.ప్రతి రోజు బడికి వెళ్లే అలవాటు ఉన్నట్లే గ్రంథాలయాలకు వెళ్లే అలవాటు దిన చర్యగా పాటించాలన్నారు. అతిథిగా హాజరైన కడప నగరపాలక సంస్థ మాజీ కమిషనర్‌ కృష్ణయ్య మాట్లాడుతూ విద్యార్థులు గ్రంథాలయానికి వెళ్లి పుస్తకాలు చదివే అలవాటు పెంచుకోవాలని, జీవితంలో ఉన్నత స్థితికి చేరడానికి పుస్తకాలు ఉపయోగపడతాయన్నారు. ప్రతియేటా గ్రంథాలయ వారోత్సవాలకు రూ 10,000 విరాళం ఇస్తానని ప్రకటించారు. నాగేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ నేటి టెక్నాలజీ యుగంలో పిల్లలు సెల్‌ ఫోన్‌ లకు బానిసలై పుస్తక పఠనానికి దూరం కావడం బాధాకరమన్నారు. అనంతరం వివిధ పాఠశాలల విద్యార్దులు జాతీయ నాయకుల వేషధారణలో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రి ప్రైమరీ నుండి 5 వ తరగతి పిల్లలకు వేషధారణలోపోటీలు, మధ్యాహ్నం 3.00 గంటలకు (8,9,10 తరగతులు)పాటల పోటీలు (దేశ భక్తి గీతాలు) నిర్వహించగా, పోటీలకు న్యాయనిర్ణేతలుగా సి.మంజులవాణి, పీఎస్‌హెచ్‌ఎం గంగాధర వ్యవహరించారు. జిల్లా గ్రంధాలయ సంస్థ కార్యదర్శి అమీరుద్దిన్‌ ,సీనియర్‌ అసిస్టెంట్‌ పి.రాజకుమార్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌ ఎలిశెట్టి పవన్‌ కుమార్‌, గ్రంధాలయాదికారులు జి.రాజకుమార్‌, టి.సురేష్‌, జె.నవాబ్జాన్‌, శేఖర్‌, వెంకటరమణ, ఇబ్రహీం సాహెబ్‌, సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement