బతకాలని లేదు.. చనిపోతున్నా | - | Sakshi
Sakshi News home page

బతకాలని లేదు.. చనిపోతున్నా

Nov 15 2026 1:02 PM | Updated on Nov 15 2026 1:02 PM

ప్రొద్దుటూరు క్రైం : ‘నాకు ఆరోగ్యం బాగలేదు.. అందుకే బతకాలని లేదు..చనిపోతున్నా..’ అని తన స్నేహితురాలికి వీడియో కాల్‌ చేసి ఓ ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్య చేసుకుంది. రూరల్‌ పరిధిలోని అమృతానగర్‌లో గౌడ సన్ని (23) అనే ట్రాన్స్‌జెండర్‌ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన విషాదం నింపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. విశాఖపట్నానికి చెందిన సన్నీ ఏడాది క్రితం ప్రొద్దుటూరుకు వచ్చి అమృతానగర్‌లోని ఓ ఇంట్లో నివాసం ఉంటోంది. తల్లిదండ్రులు గతంలోనే మరణించడంతో అమృతానగర్‌లో ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఇటీవల సన్నీకి హెచ్‌ఐవీ సోకినట్లు నిర్దారణ కావడంతో తీవ్ర మనస్థాపానికి గురైనట్లు సమాచారం. ఈ విషయం తెలిసినప్పటి నుంచి ఆరోగ్యం కూడా సరిగా లేకపోవడంతో ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో విశాఖపట్నంలో ఉంటున్న తన స్నేహితురాలికి శనివారం వీడియో కాల్‌ చేసిన సన్నీ.. తన ఆరోగ్య పరిస్థితి గురించి వివరించింది. జీవితం పట్ల విరక్తి కలుగుతోందని స్నేహితురాలికి తెలిపి.. అనంతరం కాల్‌ కట్‌ చేసి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల సమాచారం మేరకు రూరల్‌ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. సునీలా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

ఫ్రెండ్‌కు వీడియో కాల్‌ చేసి ఆత్మహత్య చేసుకున్న ట్రాన్స్‌జెండర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement