సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా | - | Sakshi
Sakshi News home page

సెన్సిటివ్‌ పోలింగ్‌ కేంద్రాలపై ప్రత్యేక నిఘా

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

జిల్లా ఎన్నికల అధికారి

శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలోని పోలింగ్‌ కేంద్రాలను సాధారణ, సున్నితమైన (సెన్సిటివ్‌), అత్యంత సున్నితమైన కేంద్రాలుగా గుర్తించినట్లు జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి తెలిపారు. శుక్రవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠ కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం ఆయన జిల్లా అధికారులతో మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా 2,480 సాధారణ, 1,911 సున్నితమైన, 1,745 అత్యంతసున్నితమైన పోలింగ్‌ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు. ఎన్నికల నియమావళి అమలును పర్యవేక్షించేందుకు 39 ఫ్లైయింగ్‌ నిఘా బృందాలు, 39 సిట్టింగ్‌ నిఘా బృందాలను గుర్తించినట్లు ఆయన వివరించారు.

ఓటర్లకు అవసరమైన సౌకర్యాలు

సేవా ఓటర్లు, ముందస్తు నిర్బంధంలో ఉన్న ఓటర్లు, ఓటర్ల జాబితాలో ఉన్నప్పటికీ అందుబాటులో లేని ఓటర్లకు సంబంధించిన ఏర్పాట్లతో పాటు ఓటరు గుర్తింపు చీటీల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు ఎన్నికల అధికారి తెలిపారు. ప్రతి మండల కేంద్రంలో ప్రత్యేక సౌకర్య కేంద్రం ద్వారా సంబంధిత సేవలు అందించనున్నట్లు వివరించారు. ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల సంఘం నిబంధనలు, మార్గదర్శకాలను అధికారులు తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అఽధికారి సూచించారు. న్యాయస్థానాల ఉత్తర్వులు అమల్లో ఉన్న గ్రామ పంచాయతీలు లేదా పదవులకు సంబంధించి ఎన్నికల నోటీసులు జారీ చేయరాదని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రక్రియలో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అన్ని చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో కె.మల్లికార్జునుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement