వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ | - | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌ను కలిసిన ఎమ్మెల్సీ

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

న్యాయమూర్తులకు శిక్షణ

కడప కార్పొరేషన్‌ : వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని శాసనమండలి సభ్యులు ఎంవీ రామచంద్రారెడ్డి కలిశారు. శుక్రవారం విజయవాడ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయనను కలిసి వైఎస్సార్‌ కడప జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగిన తీరును వివరించారు.

గేదెను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు

పామూరు: అడ్డుగా వచ్చిన గేదెను కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. ఈ ప్రమాదం శుక్రవారం వేకువజామున పామూరు మండలంలోని అయ్యవారిపల్లె స్టేజ్‌ సమీపంలో 167–బి జాతీయ రహదారిపై చోటుచేసుకుంది. వైఎస్సార్‌ కడప జిల్లాకు చెందిన ఇద్దరు మహిళలు కారులో కడప నుంచి విజయవాడకు వెళ్తున్నారు. అయ్యవారిపల్లె స్టేజ్‌ వద్దకు రాగానే రహదారి పక్కనుంచి ఓ గేదె ఒక్కసారిగా అడ్డుగా వచ్చింది. డ్రైవర్‌ సలీం తప్పించేందుకు ప్రయత్నించినా కారు గేదెను బలంగా ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఎయిర్‌బ్యాగ్స్‌ తెరుచుకోవడంతో డ్రైవర్‌ సలీం, ప్రయాణికురాలు పి.సుమలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు.

జిల్లా ప్రధాన న్యాయమూర్తిని కలిసిన కలెక్టర్‌, ఎస్పీ

కడప అర్బన్‌ : వైఎస్‌ఆర్‌ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్‌ను శుక్రవారం కడపలోని జిల్లా కోర్టులోని ప్రధాన న్యాయమూర్తి చాంబర్‌లో అన్నమయ్య జిల్లా కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌, ఎస్పీ ధీరజ్‌ కునుబిలి కలిశారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఇటీవల పదవీ బాధ్యతలు స్వీకరించడంతో వారు మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌, ఎస్పీలు ప్రధాన జిల్లా న్యాయమూర్తికి మొక్కను అందజేసి స్వాగతం పలికారు.

కడప అర్బన్‌ : కడపలోని జిల్లా కోర్టు హాలులో జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి.రామగోపాల్‌ పర్యవేక్షణలో న్యాయమూర్తులకు అదాలత్‌.ఏఐ అనే అంశంపై శుక్రవారం సాయంత్రం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైనర్ల ద్వారా కడప జిల్లా కేంద్రంలోని న్యాయమూర్తులకు ప్రత్యక్షంగా, మండల స్థాయి న్యాయమూర్తులకు వర్చువల్‌ విధానంలో శిక్షణ అందించారు. ఈ సందర్భంగా ట్రైనర్లు అదాలత్‌.ఏఐ పనితీరు, వినియోగ విధానం, న్యాయపరమైన ప్రక్రియల్లో దాని ఉపయోగాలు, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని న్యాయవ్యవస్థలో సమర్థవంతంగా వినియోగించుకునే అంశాలపై ప్రాయోగిక అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా న్యాయమూర్తులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement