నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గ్రంథాలయ వారోత్సవాలు

Nov 14 2026 1:05 AM | Updated on Nov 14 2026 1:05 AM

కడప సెవెన్‌రోడ్స్‌ : ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని శాఖా గ్రంథాలయాలలో శనివారం నుంచి 59వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా జిల్లా కేంద్ర గ్రంథాలయంలో బాలల కోసం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ దాసరి భానుప్రకాశ్‌ తెలిపారు. శుక్రవారం కడపలోని జిల్లా కేంద్ర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 14న ఉదయం 10 గంటలకు వేషధారణ పోటీలు(ప్రి ప్రైమరీ నుంచి 5 వ తరగతి వరకు), మధ్యాహ్నం 3 గంటలకు 8,9,10 తరగతుల విద్యార్థులకు (పాటలు, దేశభక్తి గీతాలు) పోటీలు ఉంటాయన్నారు. 15న ఉదయం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో కవి సమ్మేళనం, 16న ఉదయం మున్సిపల్‌ మెయిన్‌ హైస్కూలులో తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో 6,7 తరగతులకు (నేటి తరానికి గ్రంథాలయాల ఆవశ్యకత) 8,9,10 వ తరగతులకు (విద్యార్థులపై సోషల్‌ మీడియా ప్రభావం) వ్యాసరచన పోటీలు ఉంటాయన్నారు. 17న ఉదయం మున్సిపల్‌ మెయిన్‌ హైస్కూలులో 6,7 తరగతులకు (నేను దేశ ప్రధానినైతే) 8,9,10వ తరగతులకు (విద్యార్థులు– నైతిక విలువలు) ఇంటర్‌, డిగ్రీ వారికి (సూపర్‌ ఎల్‌నినో ప్రభావం), మధ్యాహ్నం 3 గంటలకు 8,9,10 తరగతులకు క్విజ్‌ పోటీలు ఉంటాయన్నారు. 18న ఉదయం 9 గంటలకు 6వ తరగతి నుంచి 10వ తరగతుల వారికి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో చదరంగ పోటీలు, మధ్యాహ్నం 3 గంటలకు చిత్ర లేఖన పోటీలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ (మెయిన్‌) హైస్కూలులో నిర్వహిస్తామన్నారు. 19న ఉదయం 10 గంటలకు మహిళా దినోత్సవం సందర్భంగా నాగార్జున మహిళా డిగ్రీ కాలేజీ కార్యక్రమం ఉంటుందని వివరించారు. 20న ఉదయం ముగింపు కార్యక్రమాలు సీపీ బౌన్‌ గ్రంథాలయంలో ఉంటుందని, ఈ సందర్భంగా నిర్వహించే ప్రత్యేక సభలో విజేతలకు బహుమతులు అందజేస్తామని చైర్మన్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి అమీరుద్దిన్‌, డిప్యూటీ లైబ్రేరియన్‌ ఎలిశెట్టి పవన్‌కుమార్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ పి.రాజకుమార్‌ పాల్గొన్నారు.

బాలికతో అసభ్య ప్రవర్తన

బద్వేలు అర్బన్‌ : స్థానిక ఆర్టీసీ బస్టాండులో ఓ ఎనిమిదేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించిన ఓ వ్యక్తికి బాలిక కుటుంబ సభ్యులు, ఇతర ప్రయాణికులు దేహశుద్ధి చేశారు. శుక్రవారం స్థానిక ఆర్టీసీ బస్టాండులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణానికి చెందిన భార్యాభర్తలు తమ పిల్లలతో కలిసి కడపకు వెళ్లేందుకు ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నారు. ఈ సమయంలో వారి కుమార్తె సమీపంలోని దుకాణం వద్దకు వెళ్లగా.. అక్కడే ఉన్న రామాంజనేయనగర్‌కు చెందిన ఓ వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడు. బాలిక ఏడుస్తూ పోయి తల్లిదండ్రులకు చెప్పడంతో వారితోపాటు ఇతర ప్రయాణికులు సదరు వ్యక్తికి దేహశుద్ధి చేసి అర్బన్‌ పోలీసులకు అప్పగించారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో సదరు వ్యక్తిని విచారణ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement