కడప వైఎస్‌ఆర్ సర్కిల్: అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 19న జిల్లాస్థాయి పారా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఎస్‌డీఓ గౌస్‌బాషా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప డీఎస్‌ఏ క్రీడా మైదానంలో దివ్యాంగ మహిళలు, పురుషులకు వేర్వేరుగా ఈ పోటీలు జరుగుతాయన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, వీల్‌చైర్ ఫెన్సింగ్, బ్లైండ్ ఫుట్‌బాల్, తైక్వాండో, టేబుల్ టెన్నిస్ అంశాల్లో జిల్లా జట్టు ఎంపికలు చేపడతామని పేర్కొన్నారు.
నిబంధనలు – వివరాలు
అర్హత: జిల్లాకు చెందిన 13 ఏళ్లు పైబడిన క్రీడాకారులు అర్హులు. సదరం సర్టిఫికెట్, యూడీఐడీ కార్డు, వైద్య ధ్రువీకరణ పత్రాలను తప్పనిసరిగా తీసుకురావాలి.
రిజిస్ట్రేషన్: ఆసక్తిగల క్రీడాకారులు నిర్దేశిత వెబ్‌సైట్‌లో పేర్లను నమోదు చేసుకోవాలి.
రాష్ట్ర స్థాయి పోటీలు: జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈ నెల 30 నుంచి డిసెంబర్ 2 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారు.
సంప్రదించాల్సిన నంబర్లు: మరిన్ని వివరాలకు 9573552108, 9440297692 నంబర్లలో సంప్రదించాలి.
‘ఖేలో ఇండియా’కు ఎంపిక
కడప వైఎస్‌ఆర్ సర్కిల్: కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కాలేజ్) విద్యార్థి ఎస్.నూర్ భాషా ఆంధ్రప్రదేశ్ ఖేలో ఇండియా కబడ్డీ జట్టుకు ఎంపికయ్యాడు. ఇటీవల గుంటూరులో నిర్వహించిన సెలక్షన్స్‌లో అత్యు త్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర జట్టులో స్థానం సంపాదించాడు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ జె.వెంకటలక్ష్మి హర్షం వ్యక్తం చేశారు. ఫిజికల్ ఎడ్యుకేషన్ విభాగం ఇన్‌ఛార్జ్ డాక్టర్ టి.హజరతయ్య, అధ్యాపకులు అభినందించారు.


