పోరుమామిళ్ల : బద్వేలు నియోజకవర్గ రాజకీయాల్లోకి కొత్తగా వచ్చిన టీడీపీ ఇన్‌చార్జి మంచూరు సూర్యనారాయణరెడ్డి డబ్బు సంస్కృతిని తెరపైకి తెచ్చారని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. ‘మీరు డబ్బు తీసుకోండి.. మాకు పదవి ఇవ్వండి‘ అనే రీతిలో టీడీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బుధవారం పోరుమామిళ్లలోని పార్టీ కార్యాలయంలో దాదాపు 50 మంది ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా విలేకరులతో ఆయన మాట్లాడారు. సూర్యనారాయణరెడ్డి కాంట్రాక్టర్ కావడంతో రాజకీయాలను వ్యాపారంగా మార్చారని ఆరోపించారు. మున్సిపల్ కార్పొరేటర్ నుండి రూ. 25 లక్షలు, ఎంపీటీసీల నుండి రూ. 10–15 లక్షలు, జెడ్పీటీసీ నుండి కోటి రూపాయల వరకు వసూలు చేసి, శ్రమ లేకుండా డబ్బుతో పదవులు కొనే సంస్కృతికి తెరతీశారని ధ్వజమెత్తారు.దివంగత వీరారెడ్డి హయాం నుండి 30, 40 ఏళ్లుగా టీడీపీ జెండా మోసిన కుటుంబాలను పక్కనబెట్టి, డబ్బున్న కొత్తవారికే సూర్యనారాయణరెడ్డి ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు.ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార పార్టీ, పోలీసులు కుమ్మకై ్క వైఎస్సార్‌సీపీ అభ్యర్థుల నామినేషన్లను లాక్కొని చించివేశారని మండిపడ్డారు. పోలీసులు తమ టోపీని టీడీపీ నేతల వద్ద తాకట్టు పెట్టారని, అరెస్టులు, బెదిరింపులతో ఏకపక్షంగా ఎన్నికలు ముగించారని ఆరోపించారు. రాబోయే సర్పంచ్ ఎన్నికలను ప్రజాస్వామ్యబద్ధంగా, అక్రమాలు లేకుండా నిర్వహించాలని డిమాండ్ చేశారు. మళ్లీ దౌర్జన్యాలకు దిగి వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను అరెస్ట్ చేస్తే.. తాను, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, యువనేత ఆదిత్యారెడ్డి కలిసి పోలీస్ స్టేషన్ల ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు.చంద్రబాబు నాయుడు తన కుమారుడు లోకేష్‌ను ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, ఇందుకోసం ఎన్ని ఘోరాలకై నా పాల్పడుతున్నారని విమర్శించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులను బెదిరించడం ఆపాలని హితవు పలికారు.సమావేశంలో వైఎస్సార్‌సీపీ నాయకులు కల్లూరు రమణారెడ్డి, ఓ. ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి


