వేమనను విశ్వకవిని చేసిన బ్రౌన్‌ | - | Sakshi
Sakshi News home page

వేమనను విశ్వకవిని చేసిన బ్రౌన్‌

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

– వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్‌

కడప ఎడ్యుకేషన్‌: తాళపత్రాలలోని వేమన పద్యాల ప్రతులను పరిష్కరింపజేసి, ‘వర్సెస్‌ ఆఫ్‌ వేమన’పేరుతో ఆంగ్లంలోకి అనువదించి వేమనను సి.పి.బ్రౌన్‌ విశ్వకవిని చేశాడని వైవీయూ రాజశేఖర్‌ పేర్కొన్నారు. సి.పి.బ్రౌన్‌ భాషా పరిశోధన కేంద్రంలో మంగళవారం సి.పి.బ్రౌన్‌ 228వ జయంతిని ఘనంగా నిర్వహించారు. సి.పి.బ్రౌన్‌ చిత్రపటానికి అతిథులంతా కలసి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వైవీయూ, నెల్లూరు విక్రమ సింహపురి విశ్వవిద్యాలయాల వీసీలు రాజశేఖర్‌, శ్రీనివాసరావు సీపీ బ్రౌన్‌ సేవలను కొనియాడా రు. ప్రధానవక్త, కవి, నటులు, గాయకుడు అక్కిరాజు సుందర రామకృష్ణ ‘రాయలసీమ రంగస్థల వైభవం’అనే అంశంపై మాట్లాడారు. జానమద్ది విజయభాస్కర్‌, విజయలక్ష్మి దంపతులు వక్తను సత్కరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement