మదనపల్లె టౌన్: మదనపల్లెలో ప్రేమ పేరుతో యువతులను మోసం చేస్తూ బ్లాక్‌మెయిల్‌కు పాల్పడుతున్న షేక్ బాదూషా (28) వ్యవహారం మంగళవారం వెలుగులోకి వచ్చింది. రెండో పట్టణ పోలీసుల కథనం మేరకు.. సదుంకు చెందిన షేక్ బాషా కుమారుడు బాదూషా పైళ్లెన విషయం దాచిపెట్టి ఫేస్‌బుక్‌లో యువతులకు వల విసురుతున్నట్లు పోలీసులు తెలిపారు. రికార్డుల ప్రకారం ఇతడిపై ఇప్పటికే మూడు కేసులు నమోదయ్యాయని చెప్పారు. సదుం పోలీస్ స్టేషన్‌న్‌లో 20/2021లో ఒక కేసు, వైఎస్‌ఆర్ కడప జిల్లా గంగిరెడ్డిపల్లి (వి.ఎన్.పల్లి) పోలీస్ స్టేషన్‌న్‌లో 56/2026 ఒక కేసు నమోదు కాగా . గతంలో సదుం లో ఓ మైనర్ ను ఎత్తుకెళ్లిన కేసులో పోక్సో కేసులో అరైస్టె బెయిల్‌పై వచ్చినా బుద్ధి మారలేదన్నారు. తాజాగా మదనపల్లెలో మరో యువతిని ఇదే తరహాలో మోసం చేయడంతో, ఆమె దూరం కావడం జీర్ణించుకోలేక ఆత్మహత్యాయత్నం నాటకమాడి బెదిరింపులకు దిగాడని తెలిపారు. యువతులు ఇలాంటి బెదిరింపులకు భయపడవద్దని, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.


