● సేద్యంలో రాణులు.. కుటుంబ పోషణలో మహారాణులు
● సేంద్రియ వ్యవసాయంతో సత్తాచాటుతున్న పట్టభద్ర మహిళలు
మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల గ్రామానికి చెందిన కర్ణాటి లక్ష్మిదేవి పోస్టు గ్రాడ్యుయేట్(పీజీ) పూర్తి చేశారు. ఉద్యోగం కోసం ఎదురు చూడకుండా కుటుంబానికి అండగా నిలవాలని నిర్ణయించుకున్నారు. అంతే తడవుగా తమకున్న 2.48 ఎకరాల వర్షాధార నల్ల రేగడి నేలలో వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులు, తగ్గుతున్న ఆహార నాణ్యత, నేల ఆరోగ్యం క్షీణత వంటి సమస్యలను ఆమె దగ్గరగా గమనించారు. ‘మనం.. పంటను మాత్రమే పండిస్తున్నాం... పోషక విలువలున్న ఆహారం కాదు’ అనే ఆలోచన ఆమెను మలుపు తిప్పింది. ఆ తర్వాత ఆమె ప్రకృతి వ్యవసాయంపై లోతైన అవగాహన పెంచుకునేందుకు సుభాష్ పాలేకర్ నిర్వహించిన శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నా రు. అప్పటి నుంచి సొంతంగా జీవామృతం, ఘన జీవామృతం వంటి సేంద్రియ పద్ధతులను ఉపయోగిస్తూ తక్కువ ఖర్చుతో అధిక లాభాల పొందుతూ ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులను పండిస్తున్నారు.
● ప్రతి ఏటా ఫ్రీ మాన్సూన్ డ్రై సోయింగ్, రబీ డ్రై సోయింగ్ పద్ధతులను క్రమం తప్పకుండా అమలు చేస్తూ సుమారు 30 రకాల విత్తనాలను చల్లుతూ నేలలో జీవవైవిధ్యాన్ని పెంచుతున్నారు.1.12 ఎకరాల్లో కంది ఏ గ్రేడ్ మెడల్, మరో 1.34 ఎకరాల్లో శనగ ఏ గ్రేడ్ మోడల్, మరో 20 సెంట్లలో ఎనీ టైమ్ మనీ మాడల్‌ను సాగు చేస్తున్నారు. కంది ఏ గ్రేడ్ మాడల్లో నువ్వులు తదితర పంటలను సాగు చేస్తున్నారు. అంతర పంట సాగు ద్వారా ఆమె కుటుంబానికి అవస రమైన ఉత్పత్తులను, కూరగాయలను స్వయంగా సమకూర్చుకోవంతోపాటు గ్రామంలోని ప్రజలకు పాఠశాల స్మార్ట్ కిచెన్‌లకు విక్రయిస్తూ ఆదాయాన్ని పొందుతున్నారు. ఈమె పండించే శనగలను తిరుపతి తిరుమల దేశస్థానం లడ్డు తయారీకి పంపిస్తుండడం విశేషం. పంట మాత్రమే కాదు ఆరోగ్యాన్ని పండించాలి అనే మహత్తర ధ్యేయంతో ఆమె సాగిస్తున్న ప్రకృతి వ్యవసాయ ప్రయాణం నేటి రైతులకు మార్గదర్శకంగా నిలుస్తోంది.


