కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో పరిపాలనాధికారిగా విధులు నిర్వహిస్తూ ఇటీవల అనారోగ్యంతో అకాల మరణం చెందిన కె.వి.రమణ కుటుంబానికి జిల్లా పోలీస్ శాఖ అండగా నిలిచింది. పోలీస్ సిబ్బంది సంక్షేమంలో భాగంగా శ్రీపోలీసు వితరణ నిధిశ్రీ నుండి మంజూరైన రూ.2.50 లక్షల ఆర్థిక సహాయాన్ని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో దివంగత ఏఓ సతీమణి లావణ్యకు ఎస్పీ ఆర్థిక సహాయం చెక్కును అందజేసి భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వారి కుటుంబ యోగక్షేమాలను విచారించిన ఎస్పీ.. అంకితభావంతో విధులు నిర్వర్తించే సిబ్బందిని కోల్పోవడం పోలీస్ శాఖకు తీరని లోటన్నారు. బాధిత కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఏఓ నిజాముద్దీన్, సూపరింటెండెంట్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.
చెక్కు అందజేసిన ఎస్పీ నచికేత్ విశ్వనాథ్
పోలీసు వితరణ నిధి నుంచి సతీమణి లావణ్యకు ఆసరా


