అమరులైన వీరుల త్యాగం చిరస్మరణీయం: డీఎఫ్‌ఓ | - | Sakshi
Sakshi News home page

అమరులైన వీరుల త్యాగం చిరస్మరణీయం: డీఎఫ్‌ఓ

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

కడప అర్బన్‌: పర్యావరణ పరిరక్షణ, అటవీ సంపద మరియు వన్యప్రాణుల రక్షణే ధ్యేయంగా విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన వీరుల త్యాగాలు చిరస్మరణీయమని వైఎస్సార్‌ కడప జిల్లా అటవీ శాఖాధికారి కె. బాలరాజు కొనియాడారు. రాష్ట్ర అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా కార్యాలయంలో స్మారక కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయ ప్రాంగణంలోని అటవీ అమరవీరుల స్థూపానికి డీఎఫ్‌ఓ కె.బాలరాజు పూలమాలలు వేసి ఘనంగా శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. సమాజ భవిష్యత్తు కోసం స్మగ్లర్లు, వేటగాళ్లను ఎదిరించి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా ఆత్మార్పణం చేసిన సిబ్బంది త్యాగాలు అమూల్యమైనవన్నారు.

అమరవీరుని కుటుంబానికి గౌరవం

విధుల నిర్వహణలో వీరమరణం పొందిన ప్రొటెక్షన్‌ వాచర్‌ బి.అశోక్‌ కుమార్‌ తల్లిని ఈ సందర్భంగా సాదరంగా సత్కరించి, అటవీ శాఖ తరపున ఆర్థిక సహాయాన్ని అందజేశాారు. ఈ కార్యక్రమంలో కడప ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్‌, బద్వేలు, ప్రొద్దుటూరు సబ్‌ డివిజనల్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్లు, రేంజ్‌ ఫారెస్ట్‌ ఆఫీసర్లు మరియు ఫీల్డ్‌ స్టాఫ్‌ పెద్ద సంఖ్యలో పాల్గొని అమరులకు నివాళులర్పించారు.

ఘనంగా అటవీ అమరవీరుల

సంస్మరణ దినోత్సవం

దివంగత ఉద్యోగి అశోక్‌ కుమార్‌ తల్లికి సత్కారం.. ఆర్థిక సాయం అందజేత

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement