10 మంది అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

10 మంది అరెస్ట్‌

Nov 11 2026 3:33 AM | Updated on Nov 11 2026 3:33 AM

కడప అర్బన్‌: కడప వన్‌ టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని పాత బస్టాండ్‌ సమీపంలో మంగళవారం పేకాట ఆడుతున్న 10 మందిని కడప వన్‌ టౌన్‌ సి.ఐ తిమ్మారెడ్డి, ఎస్‌.ఐ రాజరాజేశ్వర రెడ్డి సిబ్బందితో కలిసి దాడి చేసి అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.1,24,270 నగదు, 10 సెల్‌ఫోన్లు, 52 పేకముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈసందర్భంగా సీఐ మాట్లాడుతూ ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

జమ్మలమడుగులో చోరీ

● తాళం వేసిన ఇంట్లోకి చొరబడి 2 తులాల బంగారం,

రూ.85 వేల నగదు లూటీ!

జమ్మలమడుగు రూరల్‌: జమ్మలమడుగు పట్టణంలోని లక్ష్మీనగర్‌ కాలనీలో సోమవారం రాత్రి భారీ చోరీ జరిగింది. తాళం వేసి ఉన్న ఒక ఇంట్లోకి దొంగలు చొరబడి మరీ భారీగా నగలూ, నగదు దోచుకెళ్లినట్లు జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్‌ బాబు మంగళవారం రాత్రి అధికారికంగా ధృవీకరించారు. ఆయన వివరాల మేరకు..లక్ష్మీనగర్‌ కాలనీకి చెందిన శ్రీనివాస్‌ అనే వ్యక్తి సోమవారం రాత్రి తన కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లో ఎవరూ లేని సమయాన్ని ముందే పసిగట్టిన గుర్తుతెలియని దొంగలు.. తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. బెడ్‌రూమ్‌లోని బీరువాను ధ్వంసం చేసి, అందులో దాచి ఉంచిన 2 తులాల బంగారు ఆభరణాలతో పాటు రూ. 85,000 రూపాయల నగదును గుట్టుచప్పుడు కాకుండా దోచుకెళ్లారు.మంగళవారం సాయంత్రం ఇంటికి తిరిగివచ్చిన బాధితుడు శ్రీనివాస్‌.. తాళాలు, బీరువా పగిలి ఉండటం చూసి స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితుని ప్రాథమిక ఫిర్యాదు మేరకు జమ్మలమడుగు పోలీసులు కేసు నమోదు చేసుకుని, క్లూస్‌ టీమ్‌ సహాయంతో దొంగలను పట్టుకోవడానికి దర్యాప్తు వేగవంతం చేసినట్లు సీఐ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement