తృటిలో తప్పిన పెను ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన పెను ప్రమాదం

Nov 10 2026 1:25 AM | Updated on Nov 10 2026 1:25 AM

పులివెందుల రూరల్‌ : పులివెందుల మండలం కొత్తపల్లె గ్రామంలో సోమవారం ప్రమాదం తృటిలో తప్పింది. గ్రామానికి చెందిన గుండన్న తన ఇంటి ముందర ఉన్న ఒక పెద్ద వేప చెట్టును తొలగిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. చెట్టును నరుకుతున్న సమయంలో దాని కొమ్మలు ఒక్కసారిగా పక్కనే ఉన్న హైటెన్షన్‌ విద్యుత్‌ వైర్లపై పడ్డాయి. ఆ బరువుకు వరుసగా ఉన్న 9 విద్యుత్‌ స్తంభాలు ఒక్కదాని వెనుక ఒకటి విరిగి కిందపడిపోయాయి. స్తంభాలు విరిగిపడిన సమయంలో ఆ ప్రాంతంలో జనసంచారం లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. దీంతో గ్రామస్థులు పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. అయితే, ఒకేసారి 9 స్తంభాలు నేలమట్టం కావడంతో గ్రామంలో విద్యుత్‌ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విద్యుత్‌ శాఖ అధికారులు తక్షణమే స్పందించి, విరిగిపోయిన పాత స్తంభాల స్థానంలో కొత్తవి ఏర్పాటు చేసి గ్రామానికి విద్యుత్‌ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement