అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Nov 8 2026 1:07 AM | Updated on Nov 8 2026 1:07 AM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

మైదుకూరు : మైదుకూరు శివారులో కేసీ కాలువ కల్వర్టు కింద పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన షేక్‌ ఫిరోజ్‌(37) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. ఫిరోజ్‌ రాత్రి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని కోసం వెతికారు. మోటార్‌ బైక్‌పై బద్వేలు రోడ్డులోని అరుంధతి నగర్‌ వద్ద నుంచి కేసీ కాలువ కట్టపై వెళుతున్నట్టు తాము చూశామని తెలిసిన వారు చెప్పడంతో కట్టపైన వెతికారు. అతని ఆచూకీ తెలియకపోవడంతో శనివారం ఉదయం అదే ప్రాంతంలో మళ్లీ వెతకగా శివపురం సమీపంలో కాలువ తూము కింద నిలువ ఉన్న నీటిలో ఫిరోజ్‌ శవమై కనిపించాడు. సంఘటన గురించి తెలియడంతో అర్బన్‌ ఎస్‌ఐ చిరంజీవి అక్కడకు చేరుకుని మృతదేహాన్ని తూము నుంచి బయటకు తీయించారు. ముఖంపై, తలపై గాయాలు ఉండటంతో మద్యం మత్తులో బైక్‌తో సహా కల్వర్టుపై నుంచి కింద పడటం వల్ల తగిలిన దెబ్బలా లేకా ఎవరైనా చంపి అక్కడ పడేశారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతునికి భార్య, ఇద్దరు కమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement