కాలుష్యం వద్దు.. కాంతులే ముద్దు! | - | Sakshi
Sakshi News home page

కాలుష్యం వద్దు.. కాంతులే ముద్దు!

Nov 8 2026 1:07 AM | Updated on Nov 8 2026 1:07 AM

కాలుష్యం వద్దు.. కాంతులే ముద్దు!

కడప సిటీ: పండుగ అంటే ఆనందం... అన్ని కష్టాలు మరిచి ఆ రోజంతా ఆనందంగా, ఆహ్లాదంగా గడిపేందుకే పెద్దలు పండుగలను నిర్ణయించారు. కానీ, మితిమీరిన ఉత్సాహంతో పండుగ ఆనందాన్ని తీవ్ర ఆవేదనగా మార్చవద్దని, మరో సంవత్సరం పాటు మరువలేని తీపి గుర్తుగా నిర్వహించుకోవాలని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ప్రధానంగా దీపావళి పండుగను వయోభేదం లేకుండా అందరూ జరుపుకుంటారు. అయితే, కొందరి అత్యుత్సాహం, నిర్లక్ష్యం వల్ల ఈ ఆనందం కాస్తా దుఃఖంగా మారుతోంది. చిన్న పిల్లలు టపాసులు కాల్చే సమయంలో పెద్దలు దగ్గరుండి, వారు ప్రమాదాలకు గురికాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

పర్యావరణ హితంగా పండుగ

దీపావళి పండుగ నిర్వహణలో ప్రమాదాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు చేపట్టాలి. పండుగను పర్యావరణ హితంగా నిర్వహించుకోవాలని, ఈ పండుగ కాలుష్య కారకం కాకూడదని, దీపావళి కాంతులు మాత్రమే చాలని పర్యావరణవేత్తలు పేర్కొంటున్నారు. పండుగ రోజున కాల్చే టపాసుల నుంచి వచ్చే కాలుష్యం ప్రమాదకరమైందని, ఇకపై కాలుష్యాన్ని కలిగించే టపాసులను వినియోగించకూడదని హితవు పలుకుతున్నారు. భారీ శబ్దాలు చేసే వాటికి దూరంగా ఉండాలని సూచిస్తున్నారు. ప్రత్యేకించి ఈ పండుగ రోజుల్లో రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణాసంచా కాల్చడం ఉత్తమమని స్పష్టం చేస్తున్నారు. భారీ శబ్దాల స్థానంలో ఫ్లవర్‌ పాట్స్‌, పెన్సిల్స్‌, భూచక్రాలు, స్పార్కులర్ల వంటి కాకరొత్తులు, చిచ్చుబుడ్లు మాత్రమే కాల్చుకోవాలని, శబ్ద తీవ్రతను కనిష్ఠ స్థాయికి కుదించాలని నిపుణులు చెబుతున్నారు.

ఇలాగైతే సురక్షితం

మట్టి దీపాలు, కొవ్వొత్తులు, విద్యుత్‌ దీపాలను వెలిగించడం మంచిదని.. నెయ్యి దీపాలు వెలిగిస్తే వాతావరణంలోకి ఆక్సిజన్‌ కూడా ఎక్కువగా వెలువడుతుందని, కనుక ఇలాంటి దీపాలు వెలిగించడమే శ్రేయస్కరమని పెద్దలు సూచిస్తున్నారు. టపాసులను ఇళ్ల లోపల అస్సలు కాల్చకూడదు. దీనివల్ల విష వాయువులు ఇళ్ల మూలల్లో నిలిచిపోయి, చాలా రోజుల పాటు ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి. అలాగే సరిగా కాలనివి, సగం కాలిన టపాసులను అలాగే వదిలేయాలి. మరోసారి కాల్చుదామని వాటి దగ్గరికి వెళితే ఆకస్మాత్తుగా పేలే ప్రమాదం ఉంది. టపాసులు కాల్చేటప్పుడు కాటన్‌ దుస్తులు, కళ్లజోడులు, బూట్లు వేసుకోవడం మంచిది.

పర్యావరణ హితంగా పండుగ

జరుపుకుందాం

టపాసులు కాల్చే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి

పర్యావరణ వేత్తల సూచనలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement