పారదర్శకం లేని ప్రాదేశికం! | - | Sakshi
Sakshi News home page

పారదర్శకం లేని ప్రాదేశికం!

Nov 8 2026 1:07 AM | Updated on Nov 8 2026 1:07 AM

● ఖూనీ అయిన ప్రజాస్వామ్య స్ఫూర్తి

● ప్రజలు ఓడలేదు.. వ్యవస్థలే చిత్తయ్యాయి

● వేముల, వేంపల్లె సాక్షిగా..‘జగన్‌’ పై అభిమానం సుస్పష్టం

సాక్షి ప్రతినిధి, కడప : స్థానిక సంస్థల ఎన్నికల్లో అభాసుపాలవుతామని తెలుగుతమ్ముళ్లు ముందే అంచనా వేశారు. అందుకే ఈ ఎన్నికల్లో దౌర్జన్యాలకు తెరతీశా రు. అధికారులు సైతం దౌర్జన్యాలను అనుమతించా రు. చివరికి ఓటరు హక్కును కూడా దొంగిలించారు. ‘ఎవరెమనుకున్నా సరే, హేళన చేసినా, ఛీ కొట్టినా, తుదకు ప్రజాస్వామ్యవాదులు ఉమ్మి వేసినా పర్వాలేదు.. గెలవాల్సిందే. ఎన్ని అడ్డదారులైనా తొక్కండి, గెలుపు గుర్రం ఎక్కండి’ అంటూ టీడీపీ పెద్దలు ఇచ్చిన ఆదేశాలను క్షేత్రస్థాయిలో కూటమి నేతలు తూచ తప్పకుండా అమలు చేశారు. జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలలో వైఎస్సార్‌సీపీకి ఎలాగైనా ఓటమి చూపించామ ని చెప్పుకోవాలని అధికార పార్టీ నేతలు తహతహలాడారు. వైఎస్సార్‌సీపీ నేతల్ని, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేశారు. ప్రత్యక్ష దాడులకు తెగబడుతుంటే కట్టడి చేయాలనే ఆలోచన అధికారులకు రాలేదు.

అభాసుపాలైన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌!

ఆంధ్రప్రదేశ్‌ ఎన్నికల కమిషన్‌ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో ఘోరంగా అభాసుపాలైంది. పూర్తిగా టీడీపీ నేతల ఆదేశాలకు అనుగుణంగానే ఇక్కడి అధికారులు నిర్ణయాలు తీసుకున్నారు. ప్రతిపక్ష పోలింగ్‌ ఏజెంట్లు లేకుండానే పోలింగ్‌ను యథేచ్ఛగా కొనసాగించారు. ఎన్నికల వెబ్‌ కాస్టింగ్‌ను నిశితంగా పరిశీలిస్తే ఎస్‌ఈసీ డొల్లతనం ఇట్టే అర్థమౌతోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఉన్నత చదువులు చదివిన అధికారులు సిగ్గు, లజ్జా వదిలేసి అరాచక పాలకులకు సెల్యూట్లు కొట్టడం వల్ల వ్యవస్థలన్నీ కలగలిపి రౌడీరాజ్యానికి పట్టం కట్టాయని ప్రజలు విశ్లేసిస్తున్నారు.

ముగిసిన కౌంటింగ్‌

కడప సెవెన్‌రోడ్స్‌ : జిల్లాలో జరిగిన 16 జెడ్పీటీసీ స్థానా ల ఓట్ల లెక్కింపు శనివారం ముగిసింది. వేంపల్లె, వేము ల జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు విజ యం సాధించారు. మిగతా చోట్ల కూటమి అభ్యర్థులు గెలుపొందారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి చేసిన అరాచకాలతో ప్రజాస్వామ్య స్ఫూర్తి ఖూనీ అయింది.

ఓటర్లతో స్వచ్ఛంద పోలింగ్‌ నిర్వహిస్తే విజయం సాధించలేమని భావించిన

టీడీపీ దౌర్జన్యమార్గాన్ని ఎంచుకుంది. రిగ్గింగ్‌ చేసుకుని ప్రజా తీర్పును అపహాస్యం చేసింది.

ఎన్నిక పారదర్శకంగా జరిగితే ‘ఫ్యాను’ సునామీ ఖాయమని

వేంపల్లె, వేముల ఫలితాల సాక్షిగా రుజువైంది. స్వచ్ఛమైన ‘ప్రజాతీర్పు’ ఏంటో తెలిసింది.

మొత్తంపైన పరిషత్‌ ఎన్నికల్లో ఓటరు ఓడలేదు.. వ్యవస్థలే చిత్తయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement