అంకెల్లో... | - | Sakshi
Sakshi News home page

అంకెల్లో...

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

ఓటు హక్కు వినియోగించుకోనున్న ఓటర్ల సంఖ్య

4,39,035

పోలింగ్‌

కేంద్రాలు

560

బ్యాలెట్‌ బాక్సులు

1613

బ్యాలెట్‌ పత్రాలు

6,20,650

కడప సెవెన్‌రోడ్స్‌ : కడప నగరం సహా జమ్మలమడుగు, మైదుకూరు, రాజంపేట, ఎర్రగుంట్ల, బద్వేలు మున్సిపల్‌ ఎన్నికలు ఆదివారం జరగనున్నాయి. ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు పోలింగ్‌ నిర్వహించనున్నారు. శనివారం పోలింగ్‌ సామగ్రి పంపిణీ కేంద్రాల నుంచి ఈఓలు, ఏపీఓలకు ఎన్నికల సామాగ్రి అందజేశారు. సామాగ్రిని సరిచేసుకున్న అనంతరం ప్రత్యేక వాహనాల్లో పోలీసు భద్రత మధ్య సంబంధిత పోలింగ్‌ కేంద్రాలకు పంపారు. ప్రతి పోలింగ్‌ కేంద్రానికి నాలుగు చొప్పున ఓటర్ల జాబితా ప్రతులు, బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ పెట్టెలతోపాటు ఎన్నికల నిర్వహణకు అవసరమైన పత్రాలు, కవర్లు, బాణం గుర్తు రబ్బరు ముద్రలు, చెరగని సిరా తదితర సామాగ్రిని అందజేశారు. ఈ ఏడు కేంద్రాలనే ఎన్నికల సామాగ్రి స్వీకరణ కేంద్రాలు, భద్రపరిచే గదులు, ఓట్ల లెక్కింపు కేంద్రాలుగా కూడా సిద్ధం చేశారు. పోలింగ్‌ సిబ్బందికి తాగునీరు, భోజనం, కూర్చొనే సదుపాయాలు, మరుగుదొడ్లు, విద్యుత్‌ దీపాలు వంటి సౌకర్యాన్ని కల్పించారు. కలెక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి శనివారం కడప ఆర్ట్స్‌ కళాశాల, పులివెందుల జేఎన్‌టీయూలలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్‌ సెంటర్లను పరిశీలించారు. అలాగే జమ్మలమడుగులో పోలింగ్‌ కేంద్రాలను పరిశీలిచారు. ఈ సందర్భంగా పోలింగ్‌ సిబ్బందికి, అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. నామినేషన్ల సమయంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచు కుని కడప, పులివెందుల, జమ్మలమడుగు ప్రాంతాల్లో ప్రత్యేక భద్రతా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్‌ ప్రకటించారు. అవసరమైన ప్రాంతాల్లో అదనపు పోలీసు బలగాలు కూడా సిద్ధంగా ఉంటాయన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక నిఘాతోపాటు వెబ్‌ కాస్టింగ్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని తెలిపారు. కాగా జమ్మలమడుగులో అత్యధికంగా 28 వార్డులకు 98 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇక కడపలో మేయర్‌ పదవికి 15 మంది, 14 వార్డులకు 48 మంది పోటీ పడుతున్నారు. పులివెందులలో చైర్‌పర్సన్‌ పదవికి ఇద్దరు, 20 వార్డులకు 54 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాజంపేటలో 17 వార్డులకు 62 మంది, మైదుకూరులో 15 వార్డులకు 43 మంది, బద్వేల్‌లో ఒక వార్డుకు ఐదుగురు, ఎర్రగుంట్లలో ఒక వార్డుకు ముగ్గురు పోటీలో ఉన్నారు.

ఎన్నికల సామగ్రి

తరలించిన రూట్లు

62

మేయర్‌, చైర్‌పర్సన్‌లకు పోటీ చేస్తున్న అభ్యర్థులు

23

వైఎస్సార్‌సీపీ, టీడీపీ,

బీజేపీ, జనసేన, ఎంఐఎం..

ఎన్నికల బరిలోని ప్రధాన పార్టీలు..

కడపతోపాటు ఏడు పట్టణాల్లో ఎన్నికలు

తరలిన పోలింగ్‌ సిబ్బంది, సామగ్రి

ఓటుహక్కు వినియోగించుకోనున్న 4,39,035 మంది ఓటర్లు

పోలింగ్‌ కోసం బ్యాలెట్‌ పత్రాలు, బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం

169 వాహనాలు, 69 మార్గాలు

560 పోలింగ్‌ కేంద్రాలు ఏర్పాటు

సామగ్రిని తరలించిన వాహనాల సంఖ్య

169

జిల్లాలో

మొత్తం వార్డులు

345

సూక్ష్మ పరిశీలకుల నియామకం

208

ఎన్నికలు

జరగనున్న వార్డులు

172

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement