యువకుడు బలవన్మరణం | - | Sakshi
Sakshi News home page

యువకుడు బలవన్మరణం

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

రాజుపాళెం : మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన యార్నపాటి ఆంజనేయులు (26) అనే యువకుడు గ్రామం సమీపంలో కంబగిరి స్వామి ఆలయం వెనుక వైపున ఉన్న తమ సొంత పొలంలో శవమై ఉండటాన్ని శనివారం గుర్తించారు. స్థానికులు, కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. బీటెక్‌ చదివిన ఆంజనేయులు సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేస్తుండేవాడు. అయితే ఇటీవల ఆ ఉద్యోగాన్ని మానుకుని ఇంటి వద్దనే ఉంటూ ఆరోగ్యం సరిగా లేక మానసిక వేదనతో బాధపడుతూ ఉండేవాడు. గతనెల 24వ తేదీన ఉదయం 10 గంటలకు ఆంజనేయులు ప్రొద్దుటూరుకు పోయి వస్తానని తండ్రికి చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి యువకుడు కనిపించకుండా పోయాడు. మృతుని తండ్రి సంజీవయ్య తన పొలంలో కుమారుడి శవాన్ని కనుగొని విలపించారు. ఈ విషయంపై రాజుపాళెం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారం రోజుల క్రితమే విషపు గుళికలు తిని మృతి చెందినట్లు స్థానికుల సమాచారం ఆధారంగా తెలుస్తోంది. శవం కుళ్లిపోయి పోస్టుమార్టానికి తరలించేందుకు వీలు లేకపోవడంతో ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వాస్పత్రి డాక్టర్‌ సుల్తానా పొలం వద్దనే పోస్టుమార్టం నిర్వహించారు. ఈ సంఘటనపై మృతుడి తండ్రి సంజీవయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్‌ సీవీ రమణ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement