వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా షేక్‌ ఇస్మాయిల్‌ | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా షేక్‌ ఇస్మాయిల్‌

Nov 1 2026 4:49 AM | Updated on Nov 1 2026 4:49 AM

కమలాపురం : కమలాపురం పట్టణానికి చెందిన వైఎస్సార్‌ సీపీ యువ నాయకుడు షేక్‌ ఇస్మాయిల్‌ వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షులు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి అధికారిక ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ సందర్భంగా షేక్‌ ఇస్మాయిల్‌ విలేకరులతో మాట్లాడారు. తనపై నమ్మకంతో ఈ కీలక పదవిని కట్టబెట్టిన పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డికి జీవితాంతం రుణపడి ఉంటానని పేర్కొన్నారు.రాబోయే రోజుల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడమే ధ్యేయంగా పనిచేస్తానని ఇస్మాయిల్‌ చెప్పారు. ఇందుకోసం గ్రామ స్థాయి నుంచి శ్రేణులను ఏకం చేస్తూ, తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.తన నియామకానికి సహకరించిన వైఎస్సార్‌ జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్‌ రెడ్డికి, కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్‌చార్జి నరేన్‌ రామాంజులరెడ్డిలకు షేక్‌ ఇస్మాయిల్‌ కృతజ్ఞతలు తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement