ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తాం, ప్రభుత్వ విద్యారంగాన్ని కాపాడుతామని విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రగల్భాలు పలికారు. విద్యార్థుల భవిష్యత్తును.. ప్రభుత్వ విద్యను గాలికి వదిలేశారు. విద్యార్థి సంఘాలకు, ప్రజాస్వామ్యవాదులకు విద్యా సంస్థల ప్రాంగణాల్లోకి అనుమతులు లేకుండా చేశారు. అప్రజాస్వామ్య పరిపాలన సాగిస్తున్నారు. స్కూళ్లు కాలేజీలలో అమ్మాయిలపై జరిగే దాడులకు విద్యాశాఖ మంత్రి బాధ్యత వహించాలి.
– జి వలరాజు, రాష్ట్ర అధ్యక్షులు ఏఐఎస్‌ఎఫ్


