పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌కు పటిష్ట బందోబస్తు

Nov 1 2026 4:55 AM | Updated on Nov 1 2026 4:55 AM

● డీఐజీ కోయ ప్రవీణ్‌..

● అక్రిడిటేషన్‌ జర్నలిస్ట్‌లకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు అనుమతి

కడప అర్బన్‌: జిల్లాలోని కడప నగర పాలకసంస్థ, పులివెందుల, జమ్మలమడుగు, రాజంపేటలలో ఆదివారం జరగనున్న ఎన్నికల పోలింగ్‌కు మూడు వేలకు పైగా పోలీసు సిబ్బందిని, అదనపు బలగాలను నియమించామని కర్నూలు–కడప రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ కోయప్రవీణ్‌ వెల్లడించారు. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా శనివారం కడప ఆర్ట్స్‌ కళాశాల మైదానం నుంచి ఎన్నికల బందోబస్తు విధులకు వెళ్లే పోలీసు అధికారులకు, సిబ్బందికి డిఐజీ సూచనలు చేశారు. కడపలో 361 పోలింగ్‌ కేంద్రాలలో 16 అత్యంత సమస్యాత్మక, 42 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించామన్నారు. కడప నగరంలో వెయ్యి మందికి పైగా పోలీసులతో భద్రత కల్పించామని వివరించారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎవరైనా అల్లర్లకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఐఅండ్‌పీఆర్‌ వారు గుర్తింపు కార్డు (అక్రిడిటేషన్‌) ఇచ్చిన జర్నలిస్ట్‌లకు పోలింగ్‌ కేంద్రాల వద్దకు అనుమతి ఇవ్వాలన్నారు. డీఎస్పీ టి.భవాని, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement