టీడీపీ ఎన్నికల ప్రచార సభ వెలవెల | - | Sakshi
Sakshi News home page

టీడీపీ ఎన్నికల ప్రచార సభ వెలవెల

Oct 29 2026 1:42 AM | Updated on Oct 29 2026 1:42 AM

సాక్షి టాస్క్‌ఫోర్స్‌ : పులివెందుల పట్టణంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన తెలుగుదేశం పార్టీ నిర్వహించిన ఎన్నికల ప్రచార సభ పూర్తిగా వెలవెలబోయింది.స్థానిక పూలంగళ్ల సర్కిల్‌ వేదికగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, పులివెందుల టీడీపీ ఇన్‌చార్జ్‌ బీటెక్‌ రవి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభకు ప్రజల నుంచి తీవ్ర నిరాదరణ వ్యక్తమైంది. జనం లేక కుర్చీలు ఖాళీగా దర్శనమివ్వడంతో ఈ సభ తీవ్రంగా నిరాశపరిచింది. పులివెందుల ఓటర్ల నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో, టీడీపీ నేతలు పక్కనే ఉన్న జమ్మలమడుగు, కమలాపురం, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు ప్రాంతాల నుంచి భారీగా జనాలను వాహనాలలో తరలించారు. అయినప్పటికీ, సభా ప్రాంగణంలో జనం అంతంత మాత్రంగానే కనిపించారు. ఏదో తూతూమంత్రంగా సభను ముగించాలనే ధోరణిలో టీడీపీ నేతల ప్రసంగాలు సాగాయి. పులివెందుల మున్సిపాలిటీ ప్రజల సమస్యల గురించి కానీ, పట్టణ అభివృద్ధికి తాము చేసే పనుల గురించి కానీ టీడీపీ నేతలు ఎలాంటి హామీలు ఇవ్వలేదు. కేవలం మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేయడానికే ఈ సభను పరిమితం చేశారని స్థానికులు మండిపడుతున్నారు. జమ్మలమడుగు నుంచి ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి అనుచరులు, ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన పచ్చ శ్రేణులు తమ వాహనాల్లో వందల సంఖ్యలో కర్రలు, మారణాయుధాలను దాచుకుని పులివెందులకు చేరుకున్నారు. ఎన్నికల ప్రచార సభకు వచ్చే వారు ఇలా ఆయుధాలతో రావడం ఏంటి? అని సభకు వచ్చిన కొందరు తెలుగు తమ్ముళ్లే చర్చించుకోవడం గమనార్హం. ప్రశాంతంగా ఉండే పులివెందులలో అలజడి సృష్టించేందుకే టీడీపీ ఈ తరహా వ్యూహంతో వందలాది మంది బయటి వ్యక్తులను ఇక్కడకు రప్పించిందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

జమ్మలమడుగు, కమలాపురం, ప్రొద్దుటూరు నుంచి తరలించినా దక్కని స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement