కారు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

కారు ఢీకొని వ్యక్తి మృతి

Oct 10 2026 1:28 AM | Updated on Oct 10 2026 1:28 AM

కొండాపురం: కొండాపురం మండల పరిధిలోని జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీ వేల్పుల గురుమూర్తి (45), శుక్రవారం మధ్యాహ్నం దుస్తుల వ్యాపార నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై బ్రాహ్మణపల్లె గ్రామానికి బయలుదేరాడు. జాతీయ రహదారిపై బ్రాహ్మణపల్లె యూ–టర్న్‌ వద్దకు చేరుకోగానే, తాడిపత్రి వైపు నుంచి వేగంగా వచ్చిన ఒక కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గురుమూర్తి తలకు, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాద తీవ్రతకు కారు కూడా భారీగా దెబ్బతింది. గాయపడిన గురుమూర్తిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఘటనా స్థలాన్ని తాళ్లప్రొద్దుటూరు ఎస్‌ఐ మంజునాథ్‌ పరిశీలించారు. మృతుడి భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

హెచ్‌ఎంలు, టీచర్లకు షోకాజ్‌ నోటీసులు

కడప ఎడ్యుకేషన్‌: పాఠశాలల్లో మధ్యాహ్న భోజన ఫీడ్‌బ్యాక్‌ను ఆన్‌లైన్‌లో నమోదు చేయలేదనే నెపంతో కడప జిల్లా విద్యాశాఖ అధికారులు 265 మంది హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేశారు. దీనిపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించడంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నెట్‌వర్క్‌, సర్వర్‌ ఇబ్బందుల వల్లే యాప్‌లో వివరాలు నమోదు కాలేదని, క్షేత్రస్థాయి సమస్యలను పట్టించుకోకుండా నేరుగా నోటీసులు ఇవ్వడం సరికాదని విద్యావేత్తలు మండిపడుతున్నారు. అయితే, టీచర్లకు నోటీసులు ఇవ్వలేదని, కేవలం 10 మంది ఎంఈఓలకు మాత్రమే ఇచ్చామని డీఈఓ వివరణ ఇచ్చారు. కాగా, ఉపాధ్యాయులకు ఇచ్చిన షోకాజ్‌ నోటీసులను వెంటనే వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్‌ టీచర్స్‌ అసోసియేషన్‌ (వైఎస్సార్‌టీఏ) డిమాండ్‌ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement