రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర స్థాయి హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపిక

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్‌ కార్పొరేషన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లోని డీఏవి భారతి విద్యామందిర్‌కు చెందిన 8వ తరగతి విద్యార్థిని ఆర్‌.గీతికా రెడ్డి రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌ బాల్‌ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్‌ శివ్వం కిషోర్‌ కుమార్‌ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 28వ తేదీన పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జడ్పీహెచ్‌ఎస్‌లో జరిగిన జిల్లా స్థాయి ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌బాల్‌ పోటీలలో అండర్‌–14 విభాగంలో ఆడిన విద్యార్థిని గీతికారెడ్డి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జిల్లా హ్యాండ్‌ బాల్‌ జట్టుకు ఎంపికై నట్లు తెలిపారు. అక్టోబర్‌ 3, 4వ తేదీలలో తెనాలిలో జరిగే రాష్ట్ర స్థాయి ఎస్‌జీఎఫ్‌ హ్యాండ్‌ పోటీల్లో జిల్లా జట్టుకు తమ పాఠశాల విద్యార్థిని ప్రాతినిథ్యం వహిస్తుందని ఆయన వివరించారు. కాగా ప్లాంట్‌ హెడ్‌ రామమూర్తి, హెచ్‌ఆర్‌ హెడ్‌ గౌరీ పరమేశ్వరరావు, ఐఆర్‌ అండ్‌ పీఆర్‌ హెచ్‌ భార్గవ్‌ రెడ్డి , డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు విద్యార్థినితో పాటు పీఈటీ చందును అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement