ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు హ్యాకథాన్‌ బహుమతులు | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు హ్యాకథాన్‌ బహుమతులు

Sep 30 2026 1:52 AM | Updated on Sep 30 2026 1:52 AM

వేంపల్లె : ఇంజినీర్స్‌ డే సందర్భంగా ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేసినట్లు డైరెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. మంగళవారం ఇడుపులపాయ ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌లో కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో ఇన్నోమ్స్‌ హ్యాకథాన్‌ బహుమతుల ప్రదాన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాలు, సృజనాత్మకత, ఆవిష్కరణ దృక్పథం, సమస్య పరిష్కార సామర్థ్యాలను ప్రోత్సహించే లక్ష్యంతో హ్యాకథాన్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ హ్యాకథాన్‌న్‌లో దాదాపు 200 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని, వినూత్న ఆలోచనలు, సాంకేతిక పరిష్కారాలను రూపొందించేందుకు బృందాలుగా పనిచేశాయన్నారు. ప్రతిభ కనబరిచిన విజేతలకు మొదటి రూ.3,500, రెండవ బహుమతి రూ.2,500, మూడవ బహుమతి రూ.1,500, నాల్గవ బహుమతి రూ.1,000 నగదు బహుమతులతో పాటు ప్రశంసా పత్రాలను అందజేశారు. అనంతరం విద్యార్థులకు డైరెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌, ఏఓ రవికుమార్‌, సీఎస్‌ఈ విభాగాధిపతి చల్లా రత్న కుమారి అభినందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement