– సాక్షి, అన్నమయ్య | - | Sakshi
Sakshi News home page

– సాక్షి, అన్నమయ్య

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

భూ సమస్యపై ప్రతి వారం.. వితంతు పింఛన్‌ కోసం... పరిష్కారానికి దిక్కులేదు పీజీఆర్‌ఎస్‌ చుట్టూ ప్రదక్షిణలు

ఇతని పేరు తూట్ల గోపాలు. కురబలకోట మండలంలోని తుంగావారిపల్లి. సర్వేనెంబరు 89లో 10 ఎకరాల విస్తీర్ణంలో ఇతనికి ఎకరా 70 సెంట్లు రావాలని చెబుతున్నాడు. సర్వే నిర్వహించి తన భాగం తేల్చాలని ఆరునెలలుగా పీజీఆర్‌ఎస్‌కు తిరుగుతున్నా సర్వేయర్‌ ఇంతవరకు రాలేదని చెబుతున్నారు. ఇది ఇతరుల ఆక్రమణలో ఉంది. భాగపరిష్కారం కోసం ప్రతి వారం అర్జీ ఇస్తున్నా అధికారుల్లో చలనం లేదు. ఎన్నాళ్లు తిరగాలో..పరిష్కారం అవుతుందన్న నమ్మకం పోతోందని తూట్ల గోపాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.

ఈమె పేరు ఎం. రేవతి. సదుం మండలం చింతమాకులపల్లి. ఈమె భర్త దివ్యాంగుడు. పింఛన్‌ కూడా వచ్చేది. మూడేళ్ల క్రితం పాముకాటుతో మృతి చెందాడు. ఎలాంటి ఆర్థిక సాయం కూడా అందలేదు. అప్పటి నుంటి ఈమె వితంతు పింఛన్‌ కోసం తిరుగుతున్నా యంత్రాంగం కనికరించలేదు. ఇటీవల కూడా పింఛన్‌ కోసం ఆన్‌లైన్‌ చేసినట్లు చెబుతోంది. పింఛన్‌ ఎప్పుడు వస్తుందో.. అసలు వస్తుందో రాదోనని దిగులు చెందుతోంది.

ఈమెది కేవీపల్లి మండలం గంగోరిపల్లి. పేరు కె.గిరిజమ్మ. అడవిపల్లి రిజర్వాయర్‌కు పోయిన భూమికి నష్టపరిహారం ఇవ్వలే దు... ఇంకా 12 ఎకరాలు భూమి ఆన్‌లైన్‌ కావాల్సి ఉంది... రాయచోటిలో జిల్లా కేంద్రంగా ఉన్నప్పుడు ఒకసారి, మదనపల్లి జిల్లా కేంద్రం అయ్యాక మరోసారి పీజీఆర్‌ఎస్‌లో ఫిర్యాదు చేసింది. పీలేరు ఆర్డీఓ కోర్టులో కూడా కేసువేసింది. జేసీ ఇతర కోర్టులలో కూడా న్యాయం కోసం పోరాడుతున్నా న్యాయం జరగడం లేదని చెబుతోంది. రెవెన్యూ ఉద్యోగుల వల్ల భూ సమస్య ఏర్పడింది. ప్రతి వారం తిరుగుతున్నా పరిష్కారం కాలేదని వాపోతోంది.

ఇతని పేరు కె. రామచంద్ర, పీటీఎం మండలం విసనకర్రలవాండ్లపల్లి. స్థానికంగా ఎల్లమ్మ గుడి పూజారి. భూ సమస్యపై వారం విడచి వారం పీజీఆర్‌ఎస్‌కు వస్తున్నాడు. ఇతనికి సర్వే నెంబరు 436లో 63 సెంట్లు తండ్రి దాన విక్రయం ద్వారా సంక్రమించింది. రికార్డు కూడా పక్కాగా ఉంది. అయితే ఈ భూమిని మరో వ్యక్తి దర్జాగా ఆక్రమించుకున్నారు. రెవెన్యూ అధికారులు 25 సెంట్లు మాత్రమే చూపించారు. మిగిలిన భూమి గురించి అడిగితే పట్టించుకోవడం లేదని వాపోతున్నాడు. ఎన్నిసార్లు తిరిగినా తన భూ సమస్య పరిష్కారం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement