● నాన్నకు ప్రేమతో.. | - | Sakshi
Sakshi News home page

● నాన్నకు ప్రేమతో..

Sep 29 2026 12:21 AM | Updated on Sep 29 2026 12:21 AM

సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామానికి చెందిన అన్నదమ్ములు మహమ్మద్‌ రఫీ, దస్తగిరి తమ తండ్రిపై ఉన్న ప్రేమతో అపురూప పితృభక్తిని చాటుకున్నారు. పదేళ్ల క్రితం వారి తండ్రి షేక్‌ మహబూబ్‌ సాహెబ్‌ ఇంటి ఆవరణలో ఒక వేప మొక్కను నాటారు. 2021లో ఆయన కరోనాతో మృతి చెందారు. 2025లో పాత ఇల్లు పడగొట్టి కొత్త భవనం నిర్మించే తరుణంలో.. ఆ చెట్టును నరికేయాలని పలువురు సూచించినా వారు వినలేదు. నాన్న జ్ఞాపకం పదిలంగా ఉండాలనే ఉద్దేశంతో, ఇమేజ్‌లో కనిపిస్తున్నట్లుగా చెట్టును అలాగే ఉంచి, స్లాబ్‌ మధ్య నుంచి పైకి వెళ్లేలా నూతన ఇంటిని నిర్మించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో స్థిరపడినా, తండ్రి మాట ప్రకారం ఉమ్మడి కుటుంబంగా కలిసి ఉంటూ ఈ అన్నదమ్ములు అందరికీ ఆదర్శంగా నిలిచారు. – సింహాద్రిపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement