కడప సిటీ : తన పెంపుడు శునకాన్ని అప్పగించాలని కోరుతూ రాజంపేటకు చెందిన మలిశెట్టి సుబ్బ నరసింహులు పీజీఆర్‌ఎస్ ద్వారా కలెక్టర్‌కు విన్నవించారు. మున్సిపాలిటీ సిబ్బంది గత నెల 3న తన పెంపుడు శునకాన్ని తీసుకెళ్లారని ఫిర్యాదులో పేర్కొన్నారు. శునకానికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసిన అనంతరం వారం రోజుల్లో తిరిగి అప్పగిస్తామని సిబ్బంది హామీ ఇచ్చారని, నెల రోజులు దాటినా తనకు అప్పగించలేదని తెలిపారు. ఈ విషయమై పలుమార్లు మున్సిపాలిటీ అధికారులను సంప్రదించినప్పటికీ సరైన సమాచారం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన పెంపుడు శునకాన్ని ఆచూకీని తెలియజేసి, వెంటనే దాన్ని తనకు అప్పగించేలా సంబంధిత అధికారులను ఆదేశించాలని కలెక్టర్‌ను కోరారు.


