కడప ఎడ్యుకేషన్ : నీట్‌పీజీలో కడపకు చెందిన కాంట్రాక్టర్ శ్యామల సాయి శ్రీధర్‌రెడ్డి, గృహిణి గౌరీదేవిల కుమార్తె జతీషరెడ్డి 1239వ ర్యాంకు సాధించింది. జతీషరెడ్డి 1 నుంచి 5వ తరగతి వరకు ఆర్టీపీపీలో చదివింది. 6,7 తరగతులను హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో, 8వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విజయవాడలోని శ్రీ చైతన్య స్కూల్, జూనియర్ కళాశాలలో చదివింది. ఇంటర్‌లో 970 మార్కులు సాధించింది. నీట్‌లో జాతీయస్థాయిలో 27 వేల ర్యాంకు సాధించి ఒంగోలు రిమ్స్ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. ప్రస్తుతం నీట్‌పీజీలో 1239వ ర్యాంకు సాధించింది. డెర్మటాలజీ చేయడమే ఆశయమని జతీషరెడ్డి తెలిపారు.


