పేదలకు ఉత్తమ వైద్యసేవలందిస్తా | - | Sakshi
Sakshi News home page

పేదలకు ఉత్తమ వైద్యసేవలందిస్తా

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

చాపాడు : నీట్‌ పీజీ పరీక్షా ఫలితాల్లో మండల పరిధిలోని గుంతచీపాడు గ్రామానికి చెందిన ధనిరెడ్డి వెంకట వరుణేశ్వర్‌రెడ్డి జాతీయ స్థాయిలో 6363వ ర్యాంక్‌ సాధించాడు. గత ఏడాది కర్నూలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేశాడు. ఈ ఏడాది జరిగిన పీజీ నీట్‌ పరీక్షలో 525 మార్కులు సాధించాడు. వరుణేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ జనరల్‌ మెడిసిన్‌ పూర్తి చేసి పేద ప్రజలకు ఉత్తమ వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపాడు. ఇదే సంకల్పంతో చదివినట్లు విద్యార్థి తల్లిదండ్రులు రామలక్ష్మిరెడ్డి, ఉమామహేశ్వరి తెలిపారు. రైతు కుటుంబంలో పుట్టిన వెంకట వరుణేశ్వర్‌రెడ్డి చదువులో ప్రతిభ చాటుతూ నీట్‌ పీజీలో సీట్‌ సాధించడం పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement