● అమృతేశ్వరా.. అభయమివ్వరా!
కడప సిటీ : జిల్లాలోని శైవ క్షేత్రాలు కార్త్తిక మాస ఉత్సవాలకు సిద్ధమయ్యాయి. ఈ నెలంతా కార్తిక దీప శోభతో అలరారనున్నాయి. జిల్లాలోని అత్తిరాల పరుశురామాలయం, నిత్యపూజకోన, ఒంటిమిట్టలోని ముకుంద మల్లేశ్వరస్వామి, పొలతల శ్రీ మల్లికార్జునస్వామి, కడప నగరంలోని శ్రీ మృత్యుంజయేశ్వరస్వామి, దేవునికడప శ్రీ సోమేశ్వరస్వామి ఆలయం, అల్లాడుపల్లె, ప్రొద్దుటూరు శ్రీ అగస్త్యేశ్వరస్వామి, ఖాజీపేట మండలంలోని శ్రీ నాఽథనాథేశ్వరకోన, సింహాద్రిపురం మండలంలోని భానుకోటలోని అహోబిలేశ్వరస్వామి, శ్రీ సంగమేశ్వరస్వామి ఆలయాలతోపాటు దాదాపుఅన్ని శైవక్షేత్రాల్లో కార్తిక మాస ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.
సోమవారాలకు ప్రత్యేక స్థానం
కార్తిక మాసోత్సవాలలో భాగంగా ప్రతిరోజు ఉద యం అభిషేకాలు, అలంకారాలు, విశేష పూజలు, సర్వదర్శనం నిర్వహిస్తారు. ప్రత్యేకించి ప్రతి సోమ వారం ఆలయాల్లో ప్రత్యేక పూజోత్సవాలు నిర్వహిస్తారు. ఈ మాసంలో నాలుగు సోమవారాలు ఘనంగా నిర్వహించనున్నారు. ఆయా శివాలయాలు భక్తులతో పోటెత్తనున్నాయి. ఈనెల 24న కార్త్తిక పౌర్ణమి రానుంది. కార్తిక పౌర్ణమి రోజు కార్తీక దీపోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు.


