కడప ఎడ్యుకేషన్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పరిశ్రమ ప్రాంగణాల్లో మొక్కలను విరివిగా నాటాలని, పచ్చదనాన్ని మరింతగా పెంచాలని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్‌మెంటల్ మేనేజ్‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఈఎంసీఎల్) చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి పరిశ్రమల అధికారులను ఆదేశించారు. వైఎస్‌ఆర్ కడప జిల్లాలోని భారతి సిమెంట్ పరిశ్రమను, ముద్దనూరు మండలం జీఎం ఎకో సర్వీసెస్ ఎల్‌ఎల్‌పీ పరిశ్రమలను ఆయన గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా భారతి సిమెంట్ పరిశ్రమలోని హానికర వ్యర్థాల సహ–ప్రాసెసింగ్ యూనిట్‌ను పరిశీలించారు. హానికర వ్యర్థాలను నిర్దేశిత నిబంధనలకు అనుగుణంగా చట్టబద్ధంగా సహ–ప్రాసెసింగ్ చేస్తున్నారా లేదా అనే అంశాన్ని ధృవీకరించారు. అలాగే రికార్డులు, వ్యర్థాల నిర్వహణ విధానాలను పరిశీలించారు. దీంతోపాటు ముద్దనూరు మండలంలోని జీఎం ఎకో సర్వీస్ ఎల్‌ఎల్‌పిలోని హానికర వ్యర్థాల ప్రీ–ప్రాసెసింగ్ యూనిట్‌ను సందర్శించారు. ప్రీ–ప్రాసెస్ చేసిన హానికర వ్యర్థాలను నిబంధనలకు అనుగుణంగా.. చట్టబద్ధంగా అనుమతించిన సిమెంట్ పరిశ్రమలకు పంపిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలిం చారు.
26 నుంచి ఎస్‌జీఎఫ్
జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్‌ఆర్ సర్కిల్ : ఈనెల 26 నుంచి అక్టోబర్ 2 వరకు జిల్లాలోని వివిధ క్రీడా మైదానా ల్లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్–19 జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహిస్తున్నట్లు ఎస్‌జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి మురళీకృష్ణారెడ్డి తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2007 జనవరి 1 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ప్రతి విద్యార్ది రెండు లేదా మూడు క్రీడల్లో మాత్రమే పాల్గొనాల్సి ఉంటుందన్నారు. హాజరయ్యే వారు సంబంధిత మైదానాలకు ఉదయం 9 గంటలకు కల్లా హాజరుకావాలన్నారు.


