రేడియాలజీ చేస్తా | - | Sakshi
Sakshi News home page

రేడియాలజీ చేస్తా

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

కడప ఎడ్యుకే షన్‌ : నీట్‌ పీజీ పరీక్షా ఫలితాల్లో కడపకు చెందిన ఆవుల ప్రత్యూష 562 మార్కులు సాధించి 1450వ ర్యాంక్‌ సాధించింది. కడప నగరం చిన్నాచౌక్‌ ఎస్‌ ఆర్‌ నగర్‌కు చెందిన రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి ఆవుల ఏరికలయ్య, గృహిణి సుభాషిణి దంపతులకు మొదటి కుమార్తె డాక్టర్‌. ప్రత్యూష. ఈమె 1 నుంచి 10వ తరగతి వరకు కడప నారాయణ ఒలింపియాడ్‌ స్కూల్‌లో చదివింది. పదవ తరగతిలో 9.7 పాయింట్లు సాధించింది. ఇంటర్‌ విజయవాడ నారాయణ కాలేజీలో చదివి 976 మార్కులు సాధించింది. తరువాత నీట్‌లో ఆల్‌ ఇండియా స్థాయిలో 11 వేల ర్యాంకు సాధించి తిరుపతి ఎస్వీ మెడికల్‌ కళాశాలలో ఎంబీబీఎస్‌ పూర్తి చేసింది. ఈ సందర్భంగా ప్రత్యూష మాట్లాడుతూ పీజీలో రేడియాలజీ లేదా డెర్మటాలజిస్ట్‌ కావాలనేదే లక్ష్యమని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement