జిల్లావ్యాప్తంగా 63 పోస్టులకు 4821 మంది దరఖాస్తు
కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీ)లో ఉద్యోగ ఖాళీల భర్తీకి శుక్రవారం ఆన్‌లైన్ పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వకు, 11.30 నుంచి 1.30 వరకు, సాయంత్రం 3.30 నుంచి 5.30 వరకు మూడు విడతల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. డీసీసీ బ్యాంకులో మొత్తం 63 పోస్టులకు సంబంధించి జులై నెలలో ప్రభుత్వం నోటిఫికేషన్‌ను విడుదల చేయగా ఇందులో 23 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులుకాగా మరో 40 స్టాప్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టుల కోసం జిల్లావ్యాప్తంగా 4821 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష రాసే అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో వీరి కోసం వైఎస్సార్‌జిల్లాలోతోపాటు పొరుగు జిల్లాలైన కర్నూల్, నంద్యాల, తాడిపత్రిల్లో కూడా పరీక్షా కేంద్రాలను కేటాయించారు. అభ్యర్థులు నిర్ణయించిన సమయంలోపు హాజరుకావాలని.. నిమిషం ఆలస్యమైనా పరీక్షకు ఆనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.


