‘హార్టికల్చర్‌ హబ్‌’గా తీర్చిదిద్దడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

‘హార్టికల్చర్‌ హబ్‌’గా తీర్చిదిద్దడమే లక్ష్యం

Sep 25 2026 12:29 AM | Updated on Sep 25 2026 12:29 AM

– కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి

కడప సెవెన్‌రోడ్స్‌ : రాయలసీమ ప్రాంతాన్ని గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌ గా తీర్చిదిద్దే క్రమంలో వైఎస్‌ఆర్‌ కడప జిల్లాను ఉద్యాన పంటల సాగుకు ప్రధాన క్షేత్రంగా అభివృద్ధి చేయాలని కలెక్టర్‌ డాక్టర్‌ శ్రీధర్‌ చెరుకూరి పేర్కొన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని గణనీయంగా పెంచడంతో పాటు నీటి వనరులను సమర్థంగా వినియోగించుకునే సూక్ష్మ నీటి సాగు విధానాలను విస్తృతంగా ప్రోత్సహించాలని ఆయన అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో ఉద్యాన పంటల విస్తీర్ణం పెంపు, సూక్ష్మ నీటి సాగు విధానాల ప్రోత్సాహం, ఉద్యాన రంగ అభివృద్ధి తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్‌ ఛాంబర్‌ నుంచి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివద్ధి కార్యక్రమం కింద వైఎస్‌ఆర్‌ కడప జిల్లాకు సంబంధించి రూపొందించిన సమగ్ర ప్రణాళికను, ప్రస్తుతం ఉద్యాన సాగు విస్తీర్ణం పెంపు, సూక్ష్మ సేద్య సాగు విధానాల ప్రగతి, సంబందిత అంశాల్లో ప్రగతి గురించి సీఎం చంద్రబాబుకు కలెక్టర్‌ వివరించారు.ఉద్యాన శాఖ జిల్లా అధికారి హరిప్రసాద్‌, ఏపీ ఎంఐపీ పీడీ బి.వి. రమణ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement