దరఖాస్తుల ఆహ్వానం | - | Sakshi
Sakshi News home page

దరఖాస్తుల ఆహ్వానం

Sep 19 2026 5:44 AM | Updated on Sep 19 2026 5:44 AM

కడప ఎడ్యుకేషన్‌: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఐటీఐలలో మిగిలి ఉన్న సీట్లకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ ఐటీఐల జిల్లా కన్వీనర్‌ జ్ఞానకుమార్‌ తెలిపారు. ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు దరఖాస్తుల స్వీకరణకు గడువు ఉందని తెలిపారు. కడపలోని ప్రభుత్వ ఐటీఐ మైనారీటీలో ఈ విద్యా సంవత్సరానికి మోటార్‌ మెకానిక్‌ వెహికల్‌, కంప్యూటర్‌, వెల్డర్‌, పిట్టర్‌ ట్రేడ్‌లలో మిగిలి ఉన్న సీట్లు ప్రవేశాల కోసం https:// itiadmissions. ap.gov.inలో తప్పని సరిగా రిజిస్టర్‌ చేసుకోవాలని తెలిపారు. శిక్షణా కాలం పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ప్రాంగణ ఎంపికల ద్వారా వివిధ పరిశ్రమలలో ఉద్యోగ అవకాశం కల్పించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్‌ లేదా ఫెయిల్‌, ఇంటర్‌ పాస్‌ లేదా ఫెయిల్‌ ఆపై విద్యార్హత కలిగిన వారు ఐటీఐలో చేరేందుకు అర్హులని తెలిపారు. వివరాలకు 9949085688, 7330965183 నంబర్లలో సంప్రదించాలని జిల్లా కన్వీనర్‌ తెలిపారు.

గండి నిత్యాన్నదానానికి విరాళం

చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి పులివెందులకు చెందిన సోకే వెంకటరమణ ఆయన సతీమణి రాధ రూ.లక్ష విరాళం ఇచ్చారు. కడప పార్లమెంట్‌ సభ్యులు వైఎస్‌ అవినాష్‌ రెడ్డి జన్మదినం సందర్భంగా ఎంపీ చేతుల మీదుగా అందజేసిన చెక్కును ఆయన తిరిగి దాతల ద్వారా తమకు అందజేసినట్లు ఆలయ సహాయ కమిషనర్‌ విశ్వనాథ్‌ తెలిపారు. అలాగే వీరన్న గట్టు పల్లెకు చెందిన పళ్లా అన్నయ్యకుమారుడు పల్లా నారాయణ స్వామి రు. 25,116లు స్కానర్‌ ద్వారా విరాళం ఇచ్చినట్లు ఆలయ అధికారి తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌ వెంకటస్వామి పాల్గొన్నారు

బ్రహ్మంగారి హుండీ ఆదాయం రూ. 52లక్షలు

బ్రహ్మంగారిమఠం: శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించగా రూ 52,02,495 నగదు, 62గ్రాముల బంగారు, 351గ్రాములు వెండి వచ్చినట్లు మఠం నిర్వాకులు తెలిపారు. ఇందులో బ్రహ్మంగారిమఠం హుండీల ద్వారా రూ 47,85,689, పోలేరమ్మ దగ్గర హుండీ ద్వారా రూ 3,82,897, నిత్యఅన్నదానం దగ్గర హుండీ ద్వారా రూ 33, 909 ఆదాయం వచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మఠాధిపతి వీరధర్మజ వెంకటాద్రిస్వామి, ఎండోమెంట్‌ ఎసీ శంకర్‌బాలాజీ, విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్‌మాజీ డైరెక్టర్‌ గొ డ్లవీడు సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

ముగిసిన చెన్నకేశవుడి పవిత్రోత్సవాలు

రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి పవిత్రోత్సవాలు ముగిశాయి. ఇందులో భాగంగా శుక్రవారం స్వామివారికి పల్లకీ సేవ నిర్వహించారు. అంతకముందు ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు దీర్చారు.ప్రత్యేకపూజలు నిర్వహించారు. అనంతరం గ్రామపురవీధుల్లో పల్లకీ సేవను కొనసాగించారు. ఈ సందర్భంగా భఽక్తులు కాయకర్పూరాలను సమర్పించారు. కారక్రమంలో టెంపుల్‌ ఇన్‌స్పెక్టర్‌ బాలాజీ, మాజీ సర్పంచి గౌరీశంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

జాతీయస్థాయి పోటీలకు ఎంపిక

వేంపల్లె : ఆర్జీయూకేటీ ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులు జాతీయ స్థాయిలో జరిగే ప్రజ్ఞ – ది బిజినెస్‌ క్విజ్‌ ఫైనల్‌ పోటీలకు ఎంపికయ్యారని ట్రిపుల్‌ ఐటీ డైరెక్టర్‌ విజయ్‌ ప్రకాష్‌ తెలిపారు. శుక్రవారం ఇడుపులపాయ ఆర్‌కే వ్యాలీ ట్రిపుల్‌ ఐటీలో ఆయన మాట్లాడుతూ జాతీయ స్థాయిలో ఆఫ్‌లైన్‌ ఫైనల్స్‌ 2026 అక్టోబర్‌ 30 నుంచి నవంబర్‌ 1 వరకు భారతీయ మేనేజ్‌మెంట్‌ సంస్థ పోటీలు జరుగుతాయని, ఈ పోటీలకు 7వ జట్టు విద్యార్థులైన శ్రీచక్ర రెడ్డి, శ్రీజారెడ్డి విద్యార్థులు హాజరవుతారన్నారు. ఈ విజయం విద్యార్థుల వ్యాపార పరిజ్ఞానం, సమకాలీన అంశాలపై అవగాహన, విశ్లేషణాత్మక ఆలోచనా సామర్థ్యం, పోటీ స్ఫూర్తికి నిదర్శనంగా నిలుస్తుందన్నారు. విద్యార్థులను ఏఓ రవికుమార్‌, డీన్‌ ఆఫ్‌ ఆకడమిక్స్‌ రమేష్‌ కై లాస్‌లతోపాటు అధ్యాపకులు అభినందనలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement