తొండూరు : తొండూరులోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డీఎంహెచ్‌ఓ యుగంధర్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డ్ నమోదు విధానంపై వైద్యాధికారి గవాస్కర్‌రెడ్డిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్‌ఓ ఖాజా మొయినుద్దీన్, జిల్లా మలేరియా నివారణ అధికారి అరిఫుల్లా, జిల్లా ఎపిడమిక్ సెల్ సూపర్‌వైజర్లు ప్రసాద్ రాఘవ, మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్ధయ్య, సీనియర్ అసిస్టెంట్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.
విలేజ్ హెల్త్ క్లినిక్‌పై స్పందన
మండలంలోని బూచుపల్లి విలేజ్ హెల్త్ క్లినిక్‌ను మూసివేశారంటూ పత్రికల్లో వచ్చిన కథనంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పి.యుగంధర్ స్పందించారు. విలేజ్ హెల్త్ క్లినిక్ సీహెచ్‌ఓ, ఎంఎల్‌హెచ్‌పీ ప్రసన్న, ఏఎన్‌ఎం షహనాజ్ బేగం, ఆశా కార్యకర్తలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతతో విధులు నిర్వహించాలని ఆదేశించారు.


