ఎవరీ తుకారామ్‌ ముండే | - | Sakshi
Sakshi News home page

ఎవరీ తుకారామ్‌ ముండే

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

మహారాష్ట్ర ఫుడ్‌ అండ్‌ డ్రగ్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన కేవలం 60 రోజుల్లోనే ఆయన 1,100 దాడులు నిర్వహించి, 200 రెస్టారెంట్ల లైసెన్స్‌లను రద్దు చేశారు. 487 పాల కేంద్రాలపై దాడులు చేసి కల్తీ పాలను అరికట్టడంతో పాటు, రూ.1.50 కోట్ల విలువైన కల్తీ నూనెలను సీజ్‌ చేశారు. చట్టం ఎవరికై నా ఒక్కటేనని నిరూపిస్తూ స్వయంగా బాంబే హైకోర్టు క్యాంటిన్‌లోనే తనిఖీలు చేయించి, అపరిశుభ్రత కారణంగా దానిని మూసివేయించారు. కడప జిల్లాలోని వందలాది హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో నిరంతరం కల్తీలు జరుగుతున్నా ఫుడ్‌ సేఫ్టీ అధికారులు మామూళ్ల మత్తులో తూతూమంత్రంగా తనిఖీలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, కల్తీ మాఫియా గుండెల్లో వణుకు పుట్టించడానికి తుకారామ్‌ ముండే లాంటి కఠినమైన అధికారి వైఎస్సార్‌ కడప జిల్లాకు రావాలని స్థానికులు బలంగా డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement