ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో జరిగిన అవినీతిపై వచ్చిన ఫిర్యాదు మేరకు లోకాయుక్త కర్నూలు డీఎస్పీ కె.కృష్ణ మంగళవారం విచారణ చేపట్టారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయంలోని రికార్డులను క్షుణ్ణంగా ఆయన పరిశీలించారు. కొంత మంది సిబ్బందితో మాట్లాడి వివరాలు సేకరించారు. గతంలో ఆర్‌అండ్‌బీ గెస్ట్ హౌస్‌లో విచారణ జరిపారు. ప్రజా పక్షం పార్టీ అధ్యక్షుడు పుత్తా లక్ష్మిరెడ్డి వివరాలు అందించగా రెండో సారి ఆయన విచారణ చేశారు. లోకాయుక్త జడ్జి ఆదేశాల మేరకు విచారణ చేస్తున్నామని, వివరాలను జడ్జికి అందిస్తామని డీఎస్పీ తెలిపారు. బీజేపీ పట్టణ–1 అధ్యక్షుడు నరేంద్ర రావు మాట్లాడుతూ విచారణ త్వరగా పూర్తి చేసి దోషులను శిక్షించాలని డీఎస్పీని కోరారు. అవినీతికి పాల్పడిన అందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.


