పట్టపగలు ఇంట్లో చోరీ | - | Sakshi
Sakshi News home page

పట్టపగలు ఇంట్లో చోరీ

Sep 16 2026 3:43 AM | Updated on Sep 16 2026 3:43 AM

కడప అర్బన్‌ : కడప నగరం ద్వారకా నగర్‌లో నివాసముంటున్న ప్రైవేట్‌ ల్యాబ్‌ టెక్నీషియన్‌ సుబ్బరాయుడు ఇంట్లో సోమవారం మధ్యాహ్నం దొంగల పడి బంగారు, వెండి ఆభరణాలు అపహరించారు. కడప వన్‌టౌన్‌ పోలీసుల వివరాల మేరకు.. ద్వారకా నగర్‌లో నివాసం ఉంటున్న సుబ్బరాయుడు సోమవారం మధ్యాహ్నం కుటుంబ సభ్యులతో కడప మృత్యుంజయకుంటకు వెళ్లాడు. తిరిగి సాయంత్రం ఇంటికి వచ్చేలోపు ఇంటి తాళాలను పగలగొట్టి దొంగలు బీరువాలో ఉన్న 22 గ్రాముల బంగారు 250 గ్రాముల వెండి వస్తువులను అపహరించినట్లు తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప ఒన్‌టౌన్‌ ఎస్‌ఐ అమర్‌నాథ్‌రెడ్డి తెలియజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement