కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప జోన్ పరిధిలోని 8 జిల్లాలలో కడప, అనంతపురం, కర్నూలు, మంగళం డిపోలలో ఎలక్ట్రిక్ బస్సులను ఏర్పాటు చేసేందుకు ఇక్కడ జరుగుతున్న పనులను త్వరగా పూర్తి చేయాలని విజయవాడ హెడ్ ఆఫీస్ ఈడీఏ బ్రహ్మానందరెడ్డి, ఈడీఈ రవివర్మ తెలిపారు. శనివారం కడప నగరంలోని ఆర్‌ఎం కార్యాలయ కాన్ఫరెన్స్ హాల్‌లో జోన్ వ్యాప్తంగా రీజనల్ మేనేజర్లు, సీనియర్ మేనేజర్లు, డిపో మేనేజర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకంలో భాగంగా బస్సుల కొరత ఉందని, అయితే ఒక్కొక్క డిపోకు 50 బస్సులు చొప్పున రానున్నాయని, వాటి వల్ల రద్దీ తగ్గే అవకాశం ఉందన్నారు. అనంతరం అధికారులు కడప గ్యారేజీని, బస్టాండ్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కడప జోన్ ఈడీ ఆర్‌ఆర్ కిశోర్, కడప ఆర్‌ఎం రమేష్, డిప్యూటీ సీఎంఈ ఢిల్లీశ్వరరావు, కడప డిపో మేనేజర్ ఆర్‌సీ నిరంజన్ పాల్గొన్నారు.
పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి రిమాండ్
పీలేరు రూరల్ : పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు ఎర్రయ్యను శనివారం కోర్టుకు తరలించగా న్యాయమూర్తి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మండలంలోని చెన్నప్పగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్రయ్య.. ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.


