భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి | - | Sakshi
Sakshi News home page

భూముల రీ సర్వే పకడ్బందీగా చేపట్టాలి

Aug 23 2026 1:40 AM | Updated on Aug 23 2026 1:40 AM

జమ్మలమడుగు : భూముల రీ సర్వేకు సంబంధించిన సర్వేలతోపాటు రికార్డు కచ్చితంగా ఉండేలా సిబ్బంది చూసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ నిధిమీనా అన్నారు. శనివారం రెవెన్యూ డివిజన్‌ కార్యాలయాన్ని ఆమె సందర్శించి, డివిజన్‌ పరిధిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డీఎల్‌ఆర్‌ లాగిన్‌లో ఉన్న సమస్యలను వీఆర్వో, ఆర్‌ఐ, తహసీల్దార్లు వెంటనే పరిష్కారం చూపే విధంగా చూడాలని సూచించారు. అనంతరం ఆమె జెఎస్‌డబ్ల్యూ స్టీల్‌ ప్లాంట్‌లో పని చేసే ఉద్యోగుల కోసం కాలనీ ఏర్పాటు చేయటానికి కేటాయించిన 172 ఎకరాల స్థలాన్ని అంబవరం సమీపంలో ఉన్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శీరిష, తహసీల్దార్లు సాయినాథ్‌రెడ్డి, మనోహార్‌రెడ్డి, డివిజన్‌ సర్వేయర్‌ హరి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement