పోరుమామిళ్ల : పట్టణంలోని గిరినగర్‌కు చెందిన అశోక్ కుమార్ అనే యువకుడిపై శనివారం బంధువులు కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో అతనికి తీవ్ర గాయాలు అయ్యాయి. బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. పోలీసులకు సమాచారం తెలిసి విచారణ చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసుల నుంచి వివరాలు తెలియాల్సి ఉంది. దాడికి గల కారణాలు వారి దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది.
విద్యుత్ షాక్‌తో వ్యక్తికి గాయాలు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని పెన్నపేరూరు గ్రామ పొలంలో చెరువుపల్లి ప్రకాశ్(35) అనే వ్యక్తికి విద్యుత్ షాక్ తగిలి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికుల వివరాల మేరకు.. రాచగుడిపల్లికి చెందిన చెరువుపల్లి ప్రకాశ్ పెన్నపేరూరు గ్రామ పొలంలో గడ్డి మోపులను ట్రాక్టర్‌కి లోడు చేస్తుండగా.. పైన ఉన్న 11 కేవీ విద్యుత్ లైన్ తగిలి షాక్ కొట్టింది. ఈ ప్రమాదంలో ప్రకాశ్ తలకు తీవ్ర గాయాలు అయ్యా యి. దీంతో బాధితుడిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్‌కు తరలించారు.
బావిలో పడి మహిళ మృతి
కాశినాయన : మండలంలోని ఇటుకలపాడు గ్రామానికి చెందిన మొగతాపురం మరియమ్మ(40) శుక్రవారం సాయంత్రం బావిలో పడి మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మరియమ్మ, ఆమె భర్త ప్రసాద్ అదే గ్రామానికి చెందిన బత్తుల ప్రసాద్ భూమిని కౌలుకు తీసుకుని వరి సాగు చేశారు. పైరులో కలుపు తీసేందుకు వెళ్లిన మరియమ్మ ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది. మృతురాలి చిన్నమ్మ ఈరిపోగు గ్రేసమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ యోగేంద్ర తెలిపారు.


