కడప అర్బన్ : కడప జీఎంసీ ఆవరణలో వైద్యులు, సీనియర్ రెసిడెంట్లు తమ న్యాయమైన హక్కులు, డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె శనివారానికి 13వ రోజుకు చేరింది. కడప జీఎంసీ (రిమ్స్)జూడా అధ్యక్షులు డాక్టర్ రవితేజ జనరల్ సెక్రటరీలు డాక్టర్ మేఘన, డాక్టర్ యశ్వంత్, వైస్ ప్రెసిడెంట్లు డాక్టర్ తిరుమలేష్, డాక్టర్ యశ్వంత్ కృష్ణ మాట్లాడారు. వైద్యులం అందరం కలిసి ఐక్యత, క్రమశిక్షణతో శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నామన్నారు. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం వెంటనే స్పందించి ఏపీ జూడాలను చర్చలకు ఆహ్వానించి, సరైన న్యాయం, స్పష్టమైన పరిష్కారం చూపాలని కోరుతున్నామన్నారు. చర్చలు జరిగి, సంతృప్త్తికరమైన పరిష్కారం లభించే వరకు సమ్మె కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్‌లు పాల్గొన్నారు.


