శ్రావణ శుక్రవారాన్ని పురష్కరించుకుని జిల్లా వ్యాప్తంగా మహిళలు సామూహిక వరలక్ష్మీ వ్రతాన్ని ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి స్వాగత సూచికగా ఇళ్లముందు ముగ్గులుపెట్టి మామిడితోరణాలు కట్టారు. మహాలక్ష్మీదేవికి పంచామృతాభిషేకాలు నిర్వహించి వరలక్ష్మీ వ్రతమహత్యాన్ని తెలుసుకున్నారు. ముతైదువులకు వాయనాలు ఇచ్చి పది కాలాల పాటు సుమంగళిగా ఉండే విధంగా ఆశీస్సులు అందుకున్నారు.ఈ నేపథ్యంలో కలసపాడులోని వాసవికన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో అమ్మవారిని పసుపుకొమ్ములతో ప్రత్యేకంగా అలంకరించారు.
– కలసపాడు


