కడప రూరల్: స్థానిక పౌరహక్కుల సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 23వ తేదీన ‘జెన్‌జీ’ ఉద్యమాలపై పరిశీలన, అవగాహన సదస్సును నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.వెంకటేశ్వర్లు తెలిపారు. శుక్రవారం వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్‌క్లబ్‌లో ఆయన మాట్లాడుతూ.. దేశంలో కులం, మతం పేరిట జరుగుతున్న విద్వేష రాజకీయాలు, సామాజిక అన్యాయాలపై ఈ సదస్సులో చర్చిస్తామన్నారు. హక్కుల కోసం ప్రశ్నించే రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులను అర్బన్ నక్సలైట్లుగా, దేశద్రోహులుగా ముద్ర వేయడం దారుణమన్నారు. కడప నగరంలో జరిగే ఈ సదస్సుకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ఇంజనీర్ గుర్రప్ప, మల్లెల భాస్కర్, ప్రజాసంఘాల నాయకులు లెనిన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


