కడప అర్బన్: 2025 సంవత్సరానికి విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలను జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రదానం చేశారు. ఈ సందర్బంగా వారిని జిల్లా ఎస్.పీ ప్రత్యేకంగా అభినందించి మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు.
ఉత్కృష్ట సేవ పతకాలు–
2025 పొందిన వారు
బాలమద్దిలేటి, సీఐ, చింతకొమ్మదిన్నె పీ.ఎస్, వి.శ్రీధర్ బాబు, పిసీ202 కడప ట్రాఫిక్ పీస్.ఎం. అబ్దుల్ సలాం, పీసీ.423, డి.సి.ఆర్.బి,కడప. పి. సుధాకర్, హెచ్‌సీ.534, రాజుపాలెం పీఎస్, ఎం. మహేష్, పీసీ.709, దువ్వూరు పీఎస్,డి. వెంకట భార్గవ్, సీపీ.797, సీకేదిన్నె పీఎస్, ఈ. విశ్వనాథ్, పీసీ.1137, ఐటీ కోర్ టీమ్, ఆర్.వీరాంజనేయులు, పీసీ.2072, ప్రొద్దుటూరు ఐఐఐ టౌన్ పీఎస్, .పి. మహేష్ కుమార్ రావు, పి.సి.2128, పెద్దముడియం పీఎస్, ఎస్. రామ మోహన్ రెడ్డి, ఏ.ఆర్.పి.సి.1804, డీఏఆర్., కడప, ఎస్. జాఫర్ బాషా, ఏఆర్‌పీసీ.1814, డీఏఆర్., కడప.
అతి ఉత్కృష్ట సేవా పతకం
అవార్డు గ్రహీతలు – 2025
ఎస్. అక్బర్ అలీ, ఏ.ఎస్.ఐ.549, ఐ.టి. కోర్ టీమ్, ఎస్. అహ్మద్ అలీ, హెచ్‌సీ 1634, ఏహెచ్‌టీయూ, ఎస్. సూర్యప్రకాశ్ రావు, హెచ్‌సీ.1545, ఎస్. వెంకట సుబ్బయ్య, హెచ్‌సీ 1496, బద్వేల్ యు/జిపీఎస్, ఎస్. మహబూబ్ బాషా, హెచ్‌సీ 1424, జమ్మలమడుగు యు/జి పీఎస్. పి. నరసయ్య, పి.సి.3277, ప్రొద్దుటూరు ఐఐ టౌన్ యు/జి పి.ఎస్, వై. శ్రీనివాసులు, హెచ్‌సీ.1963, కడప ఐ టౌన్ యు/జి పి.ఎస్, ఎం. శివ రామయ్య, ఏఆర్‌హెచ్‌సీ.2481, డీఏఆర్., కడప. ఎల్. రమణారెడ్డి, ఏ.ఆర్‌హెచ్‌సీ.1222, డీఏ.ఆర్, కడప. జి. నాగేశ్వరయ్య, పి.సి.1564, మన్నూరు పీ ఎస్.
జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఇందులో భాగంగా బి.కోడూరులో 4.2 ఎంఎం, కలసపాడులో 2.8 ఎంఎం, ఖాజీపేటలో 2.4 ఎంఎం, బిమఠంలో 1.8 ఎంఎం, ఓంటిమిట్టలో 1.4 ఎంఎం, కడపలో 1.2 ఎంఎం, వల్లూరులో 1 ఎంఎం వర్షం కురిసింది.
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, వాటి వినియోగం, ప్రయోజనాలు, భద్రతా చర్యలపై ఎంబీఏ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయ సిబ్బంది శివరామకృష్ణ, భారతి బృందం (ఎస్‌బీఐ) అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలు, ఆన్‌లైన్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. డిజిటల్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోరాదని సూచించారు.


