ఆరుతడి పంటలకైనా కేసీ నీరు ఇవ్వాలి | - | Sakshi
Sakshi News home page

ఆరుతడి పంటలకైనా కేసీ నీరు ఇవ్వాలి

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

ఆరుతడి పంటలకైనా కేసీ నీరు ఇవ్వాలి ఈ ఏడాది తిండి గింజలు కరువే పంటలకు నీరివ్వాలి

శ్రీశైలం ప్రాజెక్టు వరదనీటితో నిండటం చాలా సంతోషం. అయితే కేసీ నీటిని కనీసం ఆరుతడి పంటలకై నా విడుదల చేయాలి. వర్షాధారంతో ఇటీవల సాగు చేసిన పంటలు వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. గత వారం రోజుల నుంచి కురిసిన కొద్దిపాటి వానలతో వాటికి కొంత ఊపిరొచ్చింది. మళ్లీ వరుణుడు ముఖం చాటేస్తే మాత్రం పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కేసీ కెనాల్‌ కింద కనీసం ఆరుతడి పంటలకై నా నీటిని విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – నరసింహారెడ్డి,

రైతు, పిచ్చిపాటిపల్లె, ఖాజీపేట మండలం.

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేవు. దీనితో పాటు కేసీ కాలువకు నీరు కూడా రావాలంటున్నారు. ఈ ఏడాది తినడానికి తిండిగింజలు కూడా కరువయ్యేటట్లు ఉన్నాయి. అధికారులు ఆలోచించి ఇంకో పది రోజులకై నా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేస్తే వరిపంటను సాగు చేసుకునేందుకు వీలుంటుంది. అధికారులు ఆ దిశగా తక్షణమే ఆలోచించాలి. – వేణుగోపాల్‌,

రైతు, రేపల్లి, చాపాడు మండలం.

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్‌ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేసి, సీమలోని రైతుల పంటల సాగు కోసం కేసీ కెనాల్‌కు సాగునీరు విడుదల చేయాలి. జలాశయంలో కొద్దిపాటి నీరు చేరగానే అధికారులు విద్యుత్‌ ఉత్పత్తిని ప్రారంభిస్తూ నీటినంతా కిందికి వాడేస్తున్నారు. విద్యుత్‌ ఉత్పత్తి కంటే ముందు అన్నం పెట్టే రైతుల బాగు ముఖ్యం కావాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కేసీ కాలువకు నీటిని విడుదల చేయాలి.– దస్తగిరి రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement