విద్యార్థి, వలంటీర్ల విభాగాల పాత్ర కీలకం | - | Sakshi
Sakshi News home page

విద్యార్థి, వలంటీర్ల విభాగాల పాత్ర కీలకం

Aug 13 2026 12:57 AM | Updated on Aug 13 2026 12:57 AM

కడప కార్పొరేషన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి అనుంబంధంగా విద్యార్థి, వలంటీర్ల విభాగాలు ఎంతో కీలకమైనవని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్‌రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అనుబంధ విభాగం పనితీరు, పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తామని వివరించారు. పార్టీ ఉద్యమాలు, పోరాటాల్లో విద్యార్థులు, వలంటీర్లు ప్రముఖ పాత్ర వహించేలా చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్‌ పాకా సురేష్‌ కుమార్‌, ఎస్సీసెల్‌ స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పులి సునీల్‌, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్‌రెడ్డి, వలంటీర్స్‌ విభాగం జోనల్‌ ప్రెసిడెంట్‌ అఖిలేష్‌, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement